చంద్రబాబుని ప్రశ్నించే స్థాయా నీది.. సజ్జలపై అచ్చెన్నాయుడు ఫైర్..!

టీడీపీ నేత అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.ఏపీలో సమస్యలు చాలా ఉంటే వాటిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

 Tdp Atchennaidu Fires On Sajjala Ramakrishna Reddy-TeluguStop.com

ఏపీలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత, కరోనా రోగుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.ప్రభుత్వానికి తాము సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా తప్పా అని ప్రశ్నించారు.

తాము ఇచ్చిన సలహాలను స్వీకరించకుండా పై తిరిగి తమనే విమర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Tdp Atchennaidu Fires On Sajjala Ramakrishna Reddy-చంద్రబాబుని ప్రశ్నించే స్థాయా నీది.. సజ్జలపై అచ్చెన్నాయుడు ఫైర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పరిస్థితుల్లో కరోనా నుండి ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలో ప్రభుత్వం ఆలోచించాలని ఇప్పుడు రాజకీయం చేయడం తగదని అన్నారు.

ఇక వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మీద ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు.సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబుని విమర్శించే అతటి వాడా.? అసలు నీ స్థాయి ఏంటి.? అసలు ఈ మ్యాటర్ లో నీకు సంబంధం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.జగన్ సిఎం కాకుంటే సజ్జల రామకృష్ణా రెడ్డి ఎక్కడ ఉండేవాడు.చంద్రబాబుకి ఏమీ తెలియదని మాట్లాడుతున్నారని అన్నారు.వ్యాక్సిన్ గురించి అడిగితే కేంద్రాన్ని అడగాలని అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వాలే వ్యాక్సిన్ కొనుక్కోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని.

ఈ విషయం సజ్జలకు తెలియదా అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం లేఖలు రాస్తున్నారు.

డబ్బులు కూడా ఇచ్చి వ్యాక్సిన్లు తెప్పించుకుంటున్నాయని.ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు.

ప్రతిపక్ష సూచనలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే అవి పక్కన పెట్టి అమ్మ ఒడి… ఇంకో పథకం అంటూ సొంత పథకాలను చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

#TDP VS YCP #YS Jagan #Atchennaidu #Corona Cases #AP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు