ఆ సెంటిమెంట్ అమరావతికి ఆయింట్మెంట్ లా పనిచేస్తుందా ?

జగన్ ఎంత మొండి వాడు అనేది ఆయన పార్టీ నాయకులకు, రాజకీయ ప్రత్యర్థులకు బాగా తెలుసు.తాను తీసుకున్న నిర్ణయం ఏదైనా, ఎంత కఠినమైనదైన ఎక్కడా వెనక్కి తగ్గడు జగన్.

 Tdp Applies Modi Sentiment For Amaravati Capital-TeluguStop.com

వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు అనే ఒకరకమైన అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది.తాజాగా ఏపీ రాజధానిగా అమరావతిని దాదాపు అందరూ ఫిక్స్ అయిన నేపథ్యం అకస్మాత్తుగా మూడు రాజధానులు అంటూ ప్రకటించి జగన్ కలకలం రేపారు.

అంతేకాదు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే జగన్ ప్రకటన అమలయ్యేందుకు ఎంతో సమయం పట్టదని అర్థమవుతోంది.జగన్ ముందుగా చెప్పినట్టుగానే రాజధానిని విశాఖపట్నంకు తరలించుకుపోవడం ఖాయం అయిపోయింది అన్న విషయం అందరికీ అర్థమైపోయింది.

ఎన్ని ఆందోళనలు చేసినా, జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోరు.ఈ దశలో జగన్ ను ఆపాలంటే మోదీ అస్త్రం ఒకటే పని చేస్తుందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అస్త్రాన్ని బయటకు తీశారు.అమరావతికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీని కాదని రాజధాని మార్చుతారా ? శంకుస్థాపన చేసిన తర్వాత సదరు ప్రాజెక్టు మార్చుతున్న ఘటన దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నిస్తూ, బిజెపి మద్దతు పూర్తిస్థాయిలో తమకు ఉండేలా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనాలను రెచ్చగొడుతోంది.దీనికి సంబంధించిన ఆందోళనలు కూడా వినూత్న రీతిలో చేస్తున్నారు.ప్రధాని మోదీ మాస్కులు ధరించి రోడ్లపై కూర్చోవడం కూడా ఈ తంతులో భాగంగానే అని అర్థమవుతోంది.

జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు సమర్థించారు.ఆ తర్వాత మాట మార్చారు.

ఈ నేపథ్యంలో టిడిపి నుంచి బీజేపీలో చేరిన కొంత మంది రాజ్యసభ సభ్యుల ద్వారా తెలుగుదేశం పార్టీ ఈ రకమైన ఎత్తుగడను వేస్తూ మోడీ సెంటిమెంట్ ను వాడుకోవడం మొదలు పెట్టింది.

Telugu Amaravati, Chandrababu, Modi, Tdp-Telugu Political News

మూడు రాజధానుల నిర్ణయానికి బీజేపీ కనుక మద్దతు ఇస్తే తాము ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ప్రయోజనం ఉండదు అనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.అందుకే మోదీ మాస్క్ లు ఉపయోగించి మరి బిజెపి మద్దతు తమకు ఉండేలా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది.అయితే ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్నిసెంటిమెంట్లు రాజేసిన జగన్ తాను తీసుకున్న నిర్ణయాన్నివెనక్కి తీసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube