ఇదేంటి వీర్రాజు..? ఆ లేఖ పై టీడీపీ ఫైర్ ?

తాము బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా , ఆ ప్రయత్నం సక్సెస్ కావడం లేదు సరికదా, తనను పూర్తిగా దూరం పెట్టినట్టుగా వ్యవహరిస్తుండడంతో చాలా కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుర్రుగా ఉంటూ వస్తున్నారు.అదేపనిగా కేంద్ర బీజేపీ పెద్దలకు ఫోన్లు చేస్తూ పరామర్శలు చేస్తున్నా, పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్న బీజేపీ పెద్దలు, ఏపీ అధికార పార్టీ వైసీపీ తో సన్నిహితంగా మెలిగెందుకు ప్రయత్నిస్తున్నారు.

 Tdp Angry On Ap Bjp President Somu Veerraju Letter,  Somu Veerraju Letter,  Ap B-TeluguStop.com

కేంద్రంలో జగన్ అవసరం బీజేపీకి ఎక్కువగా ఉండడంతో, వారు ఈ విధంగా చేస్తున్నారనే విషయం చంద్రబాబు కు బాగా తెలుసు.అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతుందని, అలాగే బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులు అందరిని పూర్తిగా కట్టడి చేయడం వంటి వ్యవహారాలు చాలా కాలంగా బాబుకు ఆగ్రహం తెప్పిస్తూనే ఉన్నాయి.

 ఇదిలా ఉంటే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై కొద్ది రోజులుగా వైసీపీ, ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వివాదం రేగుతుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి కుదరదంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తుండగా, నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలను నిర్వహించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

టీడీపీ సైతం ఎన్నికల నిర్వహణకు సముకంగా ఉంటూ, నిమ్మగడ్డకు మద్దతుగా మాట్లాడుతూ వస్తోంది .తాజాగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల సమయం కావాలని కోరడం, ఈ మేరకు లేఖ రాయడంపై టీడీపీ మండిపడుతోంది.ఏపీలో కొత్త ఓటర్ల నమోదుకు కనీసం రెండు నెలల సమయం కావాలంటూ, సోము వీర్రాజు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.అయితే ఇదంతా ఏపీలో స్థానిక సంస్థల ను వాయిదా వేయించేందుకే ఈ విధంగా చేస్తున్నారు అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేవలం జగన్ కు మేలు చేసేందుకు సోము వీర్రాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది.అయితే బీజేపీ మాత్రం తాను కొత్త ఓటర్ల గురించి ఆలోచించే ఈ విధంగా లేఖ రాశామని చెబుతున్నా,టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం  వీర్రాజు ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు అధికమయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube