నేడు విడుదల చేయనున్న టీడీపీ, వైసీపీ మేనిఫెస్టో! సంక్షేమమా.. ఎన్నికల గాలమా  

Tdp And Ysrcp Ready To Release Election Manifesto-

ఎన్నికల మేనిఫెస్టో అంటే ఏపీ రాజకీయాలలో ప్రజలకి, పార్టీ తరుపున కచ్చితంగా చేస్తాం అని ఇస్తున్న హామీలు అనే భావన ఇప్పుడు పూర్తిగా పోయింది.మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల సమయంలో ప్రజలని ఆకర్షించడానికి వారి ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవడానికి వేసే ఎర అనే అభిప్రాయం అందరిలోకి వెళ్ళిపోయింది.

Tdp And Ysrcp Ready To Release Election Manifesto- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు -TDP And YSRCP Ready To Release Election Manifesto-

దీనికి కారణం ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క పార్టీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో సగం కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు.

అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టో అంతా ఒక బూటకపు వల అనే విషయం ప్రజలలో చాలా మందికి తెలిసిన కూడా ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తున్నాయి అనే విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఈ నేపధ్యంలో మరోసారి ఏపీలో ప్రధాన పార్టీలైన అధికార, ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలపై ప్రజలు ప్రత్యేక ద్రుష్టి సారించారు.ఇప్పటికే మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన మేనిఫెస్టో ప్రకటించింది.

అందులో సంక్షేమ పథకాలు, అభివృద్ధికి పెద్ద పీట వేసింది.

మరి ఉగాది రోజున టీడీపీ, వైసీపీ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలని ప్రకటించడానికి రెడీ అయ్యాయి.అధికార పార్టీ ఇప్పటికే ఒకసారి అధికారంలో ఉండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో చాలా వరకు అమలు చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.అయితే ఎన్నికలకి ఆరు నెలల ముందు టీడీపీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో, వృద్ధులకి, మహిళలకి, రైతులకి భాగా చేరువైంది.

అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే నవరత్నాలు అంటూ హామీలు ఇచ్చారు.ఇక ఈ నవరత్నాలు చుట్టూనే తన మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

అలాగే కులాల వారీగా సంక్షేమం గురించి, అలాగే ప్రాజెక్ట్ ల నిర్మాణం, కార్మికల వలసల నియంత్రణపై తీసుకునే చర్యలపై ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

తాజా వార్తలు

Tdp And Ysrcp Ready To Release Election Manifesto- Related....