జనసేన గెలుపు గుర్రాలపై రెండు పార్టీల కన్ను! ఆఫర్ గట్టిగానే ఉంది  

Tdp And Ysrcp Concentrate On Janasena Winning Mla Candidates -

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ప్రకటనని సరంజామ సిద్దం అవుతుంది.అధికారులు కౌంటింగ్ కి అంతా రెడీ చేస్తున్నారు.

Tdp And Ysrcp Concentrate On Janasena Winning Mla Candidates

ఇక ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయ పార్టీలలో ఉత్కంట రేపుతున్నాయి.ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఎప్పుడు ఒక క్లారిటీ ఉండేది.

అయితే ఈ ఎన్నికలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు.ఇక ఈ ఎన్నికలలో జనసేన ప్రభావం ఎ స్థాయిలో ఉండబోతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సారి ప్రధాన పార్టీలైన తెలుగు దేశం, వైసీపీ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది అని, ఇక జనసేన పార్టీ కూడా కొన్ని స్థానాలలో చాలా బలంగా రెండు పార్టీలకి గట్టి పోటీ ఇచ్చి గెలిచే స్థాయిలో ఉందని టాక్ వినిపిస్తుంది.ఈ నేపప్ధ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉండదని, కచ్చితంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో జనసేన పార్టీ గెలుపు గుర్రాలపై రెండు పార్టీల నేతలు ద్రుష్టి పెట్టి వారికి భారీగా ఆఫర్స్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది.గెలిచినా తర్వాత జనసేన పార్టీతో సంబంధం లేకుండా తమకి మద్దతు ఇస్తే మంత్రి పదవి, ఇరవై కోట్లు డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఇంత భారీ డిమాండ్ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలని ఎంత వరకు కాపాడుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు