అధికార, ప్రతిపక్షాలని భయపెడుతున్న క్రాస్ ఓటింగ్! జనసేన దెబ్బ గట్టిగా తగులుతుందా  

Tdp And Ycp Fear About Cross Voting In Ap Elections -

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమ గెలుపుపై బయటికి మాటలు చెబుతున్న లోపల మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఏపీలో ప్రజలు ఓట్లు ఎ ప్రాతిపాదిక మీద వేసారు.

Tdp And Ycp Fear About Cross Voting In Ap Elections

ఓటింగ్ ఈ స్థాయిలో పెరగడానికి కారణాలు ఏంటి అనే విషయంలో కూడా రెండు పార్టీలు ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పలేకపోతున్నాయి.మరో వైపు ఈ సారి ఎన్నికలలో ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది అనే టాక్ ఇప్పుడు రెండు పార్టీలని మరింత టెన్షన్ కి గురి చేస్తుంది

ఏపీలో క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెప్పడానికి ప్రస్తుతం ఆయా నియోజక వర్గాలలో ప్రజల నుంచి వినిపిస్తున్న మాటలు.

జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేకి ఓట్లు వేసి ఎంపీకి వేరొకరికి వేయడం, అలాగే ఎంపీ బలంగా ఉన్న చోట జనసేన స్థానిక సమీకరణాలు బట్టి జనసేన అభ్యర్ధి ఓట్లు గట్టిగా రాబట్టినట్లు రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది.

జనసేన పార్టీ అభ్యర్ధులు, అధినేత కూడా ఇలా సైలెంట్ గా ఉండటానికి ప్రధాన కారణం వారికి స్థానికంగా వచ్చిన పోల్ సర్వే అనే మాట వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు జనసేనని టార్గెట్ చేసే ప్రయత్నం చేయకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో తమకు లభించే కింగ్ మేకర్ ఛాన్స్ ని బలంగా ఉపయోగించుకోవాలని జనసేనాని కూడా ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp And Ycp Fear About Cross Voting In Ap Elections- Related....