ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో( Tiruvuru ) అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది.ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు.
తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ ( Swamidas )అవినీతిని నిరూపిస్తానని టీడీపీ నేత కొలకపూడి శ్రీనివాస రావు( Kolakapudi Srinivasa Rao ) ఛాలెంజ్ చేశారు.మరోవైపు కొలకపూడి శ్రీనివాసరావు వలస పక్షి అంటూ వైసీపీ నేత స్వామిదాస్ ఆరోపించారు.
ఇరు నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలో తిరువూరులో భారీగా మోహరించారు.
అనంతరం స్వామిదాస్, శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.