ఆ ఇద్దరి విష‌యంలో ఏమీ చేయ‌లేక‌పోతున్న టీడీపీ, వైసీపీ..

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నది ఇద్దరు లీడర్లు మాత్రమే.వారే వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

 Tdp And Ycp Are Unable To Do Anything About Those Two Details, Tdp, Ycp, Vallabh-TeluguStop.com

వీరిద్దరివి బలమైన పార్టీలు అందులోనూ ప్రాంతీయ పార్టీలు.ఆయా పార్టీల్లో వారు ఏం చెబితే అదే వేదం.

వీరి ఇమేజ్‌పై బేస్ అయి ఆ పార్టీలు కొనసాగుతున్నాయి.పార్టీల విషయంలో ఇంత ప్లాన్‌గా వ్యవహరిస్తున్న వీరిద్దరు కొన్ని విషయాల్లో తమ వారి చేతుల్లోనే ఓటమి పాలవుతున్నారు.

టీడీపీ తరపున వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు కారణమైంది చంద్రబాబు నాయుడు.కానీ ప్రస్తుతం వైసీపీ ప్రో గా మారి ప్రస్తుతం చంద్రబాబునే విమర్శిస్తున్నారు.

చంద్రబాబు ఫ్యామిలీపైనే తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నా ఏం చేయలేని పరిస్థిలో ఉన్నారు టీడీపీ అధినేత.మొదటి నుంచి వైసీపీలో ఉన్న నేతలకంటే వంశీ చేస్తున్న కామెంట్సే తెలుగుదేశం పార్టీనీ బాధపెడుతున్నాయి.

అయినా.టెక్నికల్‌గా చంద్రబాబు నాయుడి వైపున ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీసైతం ఒకరు.

కానీ, వంశీపై యాక్షన్ తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారన్నదే ప్రశ్న.

ఇక వైసీపీలోనూ అదే పరిస్థితి.

నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు ఎప్పుడూ ఢిల్లీలోనే ప్రెస్ మీట్స్ పెడుతూ జగన్ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Raghurama-Telugu Political News

విపక్షానికి ఆయన ఎజెండా సెట్ చేస్తున్నట్లు  టాక్.వైసీపీ అధికారంలో ఉన్నా, బలంగా ఉన్నా.రఘురామ విషయంలో జగన్ ఏమీ చేయడం లేదు.

పార్టీ తనపున యాక్షన్ తీసుకునేందుకు చాన్స్ ఉన్నప్పటికీ ఎందుకు వాటిని పట్టించుకోవడం లేదో అర్థం కాని విషయం.ఇలా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, జగన్.

తమ పార్టీలోని లీడర్లపై మాత్రం కఠినంగా వ్యవహరించలేక పోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.వీరు ఎందుకు వెనకంజ వేస్తున్నారనేది అందరికీ ఎదురవుతున్న ప్రశ్న.

చూడాలి మరి ఏమౌతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube