టీడీపీ- టీఆర్ఎస్ పొత్తు ఉండబోతోందా ..  

Tdp And Trs Will Tie Up In Telangana-

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే మాట తరుచూ వింటుంటాం.అది అక్షరాలా వాస్తవం అనేది మనం ఎన్నో సార్లు చూస్తూనే ఉన్నాం.ఒకరినొకరు తిట్టుకుని కత్తులు దూసుకున్న వారే మరునాడు బుజాల మీద చేతులేసుకుని తిరగడం రాజకీయాల్లో సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది..

Tdp And Trs Will Tie Up In Telangana--TDP And TRS Will Tie Up In Telangana-

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే కనిపించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.రాజమండ్రి ఎంపీ మాగంటి మురళి మోహన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

తెలంగాణాలో ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ – టీఆర్ఎస్ పార్టీలు జత కట్టే అవకాశం ఉన్నట్టుగా ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయి.టీడీపీ టీఆర్ఎస్ పార్టీతో జతకట్టాలని భావిస్తుందా.

? ఆమేరకు టీడీపీ అధినేత వ్యూహం రచిస్తున్నారా? అనే అనుమానాల్ని తాజాగా రేకెత్తించారు టీడీపీ ఎంపీ మురళీ మోహన్.చంద్రబాబు, కేసీఆర్‌ కలిస్తే కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమంటూ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనమయ్యాయి..

బాబు, కేసీఆర్‌లు కలిస్తే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని టీడీపీ ఎంపీ అన్నారు.కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన మురళీ మోహన్, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ టీఆర్ఎస్ కలిస్తే.

రెండు రాష్ట్రాల్లోని 42 పార్లమెంటు స్థానాలూ ఈ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు గతంలో టీడీపీ టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా వ్యవహరించింది.కానీ చంద్రబాబు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు..

మురళి మోహన్ మాత్రం పొత్తు గురించి అంతా మాట్లాడేసి ఆ తరువాత ఇదంతా నా అభిప్రాయం మాత్రమేనని చెప్పారు.అయితే టీడీపీ అధినేతకు సన్నిహితంగా ఉండే మురళి మోహన్ ఈ వ్యాఖ్యలు చెయ్యడం చూస్తుంటే బాబు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది.