ఇది తాత్కాలిక గెలుపే!!!

తెలుగుదేశం, మరియు టీఆరఎస్ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది.కొంటొన్మెంట్ ఎన్నికల్లో చతికిల పడిన తెలుగుదేశాన్ని విమర్శిస్తూ తెరాస అనేక వ్యూహాలు పన్నుతుంది.

 Tdp And Trs War In Telangana Elections-TeluguStop.com

ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పని అయిపోయింది అని, ఇక మున్ముందు తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా దక్కవు అని వారు విమర్శిస్తున్నారు.ఇక దానికి ధీటుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నేత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎన్నికలలో టిడిపి ఓడిపోయిందని, ఆ పార్టీ పని అయిపోయిందని టిఆర్ఎస్ నేతలు ప్రచారం చెయ్యడం వారి పొగరుకు నిదర్శనం అని, ఇది కేవలం వారి భ్రమ మాత్రమేనని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో ఎవరేమిటో తెలుస్తుందని అన్నారు.

పార్టీల గుర్తులు లేని ఎన్నికలలో ,పార్టీ రాజకీయాలతో సంబందం లేని ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచిందని చెప్పుకుంటున్నారని ఆయన తెరాసాకు కౌంటర్ ఇచ్చారు.కొంటొన్మెంట్ లో తెరాసా గెలుపుకు కారణం అక్కడ అధికార దుర్వినియోగం జరగడం వల్లనే అని ఆయన తెలిపారు.

అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో తడఖా చూపిస్తామని తెలంగాణ తెలుగుదేశం తరపున ఆయన స్పష్టం చేశారు.మరి రాష్ట్రం ఏర్పడి కేవలం కొద్ది నెలలే కావడం.

పైగా ఇంకా తెలంగాణా నినాదం ప్రజల్లో ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube