ఎత్తులు పై ఎత్తులు జనం చెవిలో పూలు ?  

Tdp And Janasena Alliance In Ap Elections - Telugu Ap Elections, Chandrababu Naidu, Cpi, Cpi Narayana, Janasena, Janasena And Tdp, Jc Diwakar Reddy, Tdp, Tdp And Cpi, Ycp, Ycp And Tdp And Janasena

రాజకీయ అవసరాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియదు.మితృత్వం, శత్రుత్వం అనేది ఆయా రాజకీయ పార్టీల అవసరాలను బట్టి ఉంటుంది.

 Tdp And Janasena Alliance In Ap Elections

అప్పటి వరకు శత్రువు గా ఉన్నవాడే మిత్రుడు అవుతాడు.మిత్రుడే శత్రువు అవుతాడు.

ఇవన్నీ రాజకీయాల్లో సర్వ సాధారణ అంశాలు.ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల పొత్తులు విచిత్రం గా తయారయ్యాయి.

ఎత్తులు పై ఎత్తులు జనం చెవిలో పూలు -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో ? ఎందుకు పెట్టుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.గత ఎన్నికల ముందు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేన ఈసారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు నడుస్తోంది.

అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన నాయకులు టిడిపితో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకున్నారు.

దీంతో అసలు జనసేన బీజేపీతో కలిసి వెళ్తుందా లేక టిడిపితో కలిసి వెళ్తుందా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

గతంలో జనసేనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధం అయ్యాయి.ఏపీని చంద్రబాబు సర్వ నాశనం చేశాడు, అవినీతిలో ముంచి తేల్చాడనే విమర్శలు చేసిన కామ్రేడ్స్ ఇప్పుడు బాబు తో పొత్తుకు తహతహలాడుతున్నారు.

ఈ మేరకు చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకుంటాము అంటూ సిపిఐ నారాయణ చెబుతున్నారు.సిపిఎం మాత్రం ఇంకా పొత్తు విషయంలో తర్జనభర్జన పడుతోంది.

మొన్నటి వరకు చంద్రబాబును తిట్టిన వామపక్ష పార్టీలు ఇప్పుడు అదే చంద్రబాబు తో పొత్తు పెట్టుకోవడం జనాల చెవుల్లో పువ్వులు పెట్టడంగానే కనిపిస్తోంది.

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, టిడిపి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు బలంగా ఉంది.దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు తట్టుకోవడం కష్టమనే భావన చంద్రబాబులో ఎక్కువగా ఉంది.ఇలా పొత్తులతో బలం పెంచుకుని అధికార పార్టీతో ఢీ కొట్టాలని చంద్రబాబు చూస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు టచ్ లో ఉన్నట్లు వైసీపీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.అటు బీజేపీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు బలమున్న చోట ఒకరికొకరు సహకరించుకోవాలి అని వారు లోపాయకారి పొత్తు పెట్టుకున్నారని చెబుతున్నారు.

నిన్నటి దాకా ఒకరి మీద ఒకరు తిట్ల దండకం మొదలుపెట్టి ఇప్పుడు కొత్తగా కలిసి జనాలను మోసం చేస్తున్నారు అంటూ వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.కామ్రేడ్స్ మొన్నటిదాకా చంద్రబాబు ని తిట్టి ఇప్పుడు అదే చంద్రబాబు దగ్గరకు ఎందుకు చేరాల్సి వచ్చిందో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ ఎవరెన్ని పొత్తులు, ఎత్తులు వేసినా జగన్ గెలుస్తాడని, జగన్ ను ఓడించడం అసాధ్యం అంటూ ఆయన జోస్యం చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test