కాంగ్రెస్ తో బాబు కలుస్తారా..టీడీపి లో ఏం జరుగుతోంది..       2018-06-04   00:15:04  IST  Bhanu C

కాంగ్రెస్ పార్టీ తో తెలుగుదేశం పార్టీ కలుస్తుందా..? చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకుంటారా..? అసలు ఈ రకమైన చర్చ జరుగుతుందని బహుశా టీడీపీ లో ఏ ఒక్క కార్యకర్త అనుకుని ఉండరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన నందమూరి తారకరామారావు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ పార్టీ కోసం టీడీపి ని ముందుకు తీసుకుని వెళ్లి సక్సెస్ అయ్యారు..అలాంటి పార్టీ తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్నేహ హస్తం ఇస్తుందంటే పెద్ద డౌట్ గానే ఉన్నా ఇది వాస్తవం అంటున్నారు టీడీపీ లోని కొందరు నేతలు..వివరాలలోకి వెళ్తే..

కేంద్రంలో బీజేపీతో పోరాటం చేస్తూ ఆ పార్టీ నడ్డి విరచాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ స్నేహ హస్తం ఉండాలనేది రాజకీయ పార్టీల భావంగా తెలుస్తోంది..ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో చేయి చేయి కలపాలని చంద్రబు పై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది..ఇదే విషయంపై ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతూ ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పరిస్థితులకి తగ్గట్టుగా రాజకీయ వ్యూహాలు మారాలని ఆమె చంద్రబాబు పై ఒత్తిడి తెస్తున్నారట.

ఇదిలాఉంటే బయట పార్టీల నుంచీ వచ్చే ఒత్తిడి కాకుండా తెలంగాణలో ఉన్న టీడీపీ నుంచీ కూడా ఈ విషయంపై చంద్రబాబు పై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు… ఈ విషయంలో సాధ్యమైనంత తొందరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధినేతకి చెప్తున్నారట…అయితే ఈ విషయం తెలిపిన ప్రతీ సారి చంద్రబాబు వారికి ఎదో ఒక రకంగా సర్దిచెప్తున్నారట.

అయ్తీ ఒక పక్క జాతీయ స్థాయి నాయకులు ఇటు నుంచీ తెలుగు రాష్ట్రాల టీడీపీ నాయకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇక తప్పకుండా చంద్రబాబు ఎదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చిందని టీడీపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు..మరి టీడీపీ కి కాంగ్రెస్ కి ఉన్న వైరం గురించి మాత్రమే ఆలోచన చేస్తుంటే మాత్రం ఇక ఆ ఆలోచన పక్కన పెట్టమని రాజకీయాల్లో ఇలాంటివి సహజమేగా మీకు మేము చెప్పేవాళ్ళం కాకపోయినా ఒక సారి ఆలోచన చేయండి అంటూ కేంద్రంలో ఉన్న పార్టీలు సైతం చంద్రబాబు కి చెప్తున్నాయట మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.