టీడీపీని కార్య‌క‌ర్త‌లు న‌మ్మ‌ట్లేదంట‌.. టీడీపీ గెలుపుపై జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అస‌లే ఇప్పుడు ఏపీలో టీడీపీ అధ్వానంగా త‌యార‌వుతోంది.ఇలాంటి స‌మ‌యంలో పార్టీలో ఉన్న వారంతా కూడా క‌లిసి కట్టుగా పార్టీని న‌డిపించేందుకు ముందుకు రావాలి గానీ లేనిపోని మాట‌ల‌తో పార్టీని ఇర‌కాటంలో ప‌డేస్తున్నారు చాలామంది.

 Tdp Activists Do Not Believe .. Jp Prabhakar Reddy's Sensational Comments On Tdp-TeluguStop.com

దీంతో చంద్ర‌బాబుకు కొత్త త‌ల‌నొప్పులు త‌యార‌వుతున్నాయి.ప్ర‌తిపక్ష‌ల కంటే కూడా సొంత పార్టీ నేత‌ల‌తోనే ఆయ‌న‌కు ఎక్కువ‌గా ఇబ్బందులు వ‌స్తున్నాయి.

ఇక ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూపంలో చంద్ర‌బాబుకు కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయి.

ఆయ‌న రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గ‌న‌క టీడీపీ క‌చ్చితంగా మళ్లీ ఓడిపోతుందని చెప్ప‌డం పెను సంచ‌ల‌న‌మే రేపుతోంది.

ఇపుడు చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని అలాగే పార్టీ భ‌విష్య‌త్‌పై కార్యకర్త‌ల్లో ఎలాంటి న‌మ్మ‌కం లేద‌ని ఆయ‌న అన్నారు.ఇప్ప‌టికైనా స‌రే వెంట‌నే చంద్రబాబు మేలుకుని పార్టీని న‌మ్ముకున్న వారిని కంట క‌నిపెట్టుకోక‌పోతే మాత్రం కష్టమన్నారు.

ఇప్ప‌టికిప్పుడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులగా ఉన్న వారిని పూర్తిగా మార్చాలని లేదంటే మాత్రం క‌ష్ట‌మేన‌న్నారు.

Telugu Chandra Babu, Tdp, Tdp Candiadtes, Ysrcp-Telugu Political News

పార్టీలో గ్రూపులు ఎక్కువ‌య్యాయ‌ని, దానికి తోడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ టీడీపీలో తీసుకుంఉన్న ఏకపక్ష నిర్ణ‌యాలు చాలా వ‌ర‌కు ఇబ్బందులే తెస్తున్నాయ‌న్నారు.ఆయ‌న ఎవ‌రికీ ఎలాంటి సమాచారం ఇవ్వ‌కుండానే మీటింగ్ నిర్వహిస్తున్నారని చెప్ప‌డం ఇప్పుడు టీడీపీని మ‌రింత ఇబ్బందుల్లోకి గురి చేస్తోంది.ఎందుకంటే పార్టీలో ఆయ‌న‌లాంటి సీనియ‌ర్లే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే ఇక కింది స్థాయి కార్య‌క‌ర్త‌లు ఎలా న‌మ్ముతార‌ని అంతా అనుకుంటున్నారు.

ఏదేమైనా చంద్ర‌బాబుకు మాత్రం రోజుకో కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి.ఇలాంటి నేత‌ల‌ను ఎంత కంట్రోల్ పెడితే పార్టీ అంత బాగుంటుంద‌ని చంద్ర‌బాబుకు తెలుగు త‌మ్ముళ్లు సూచిస్తున్నారంట‌.కానీ ఏదేమ‌నా జేసీ మాట‌ల్లో కూడా నిజం లేక‌పోలేద‌ని నిపుణ‌లు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube