విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.మాజీ మంత్రి, టీడీపీ సీనియార్ నేత దేవినేని ఉమామహేశ్వరవు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమం లో భాగంగా పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి పార్టీ జన్మదిన కేకును కట్ చేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించడం కోసం ఎంతో కృషి చేశారన్నారు.
ఈరోజు పార్టీలో నాయకులు కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడే అని కొనియాడారు.ఈరోజు వందలాది కిలోమీటర్ల పయనాన్ని మొదలుపెట్టిన నారా లోకేష్ చూసి వైసీపీ ఓర్చుకోలేక పోతుందన్నారు.







