అమెరికన్ల వైపు టీసీఎస్ మొగ్గు: భారత ఐటీ నిపుణులకు ఉద్యోగాల కోత..?  

TCS Will Hire 1500 Freshers In America This Lead To Job Cuts In India - Telugu 1500 Freshers In America, Job Cuts In India, Ocalization’ Efforts In The Usa, Tcs, అమెరికా, టీసీఎస్

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ అమెరికాలోని స్థానికులను ఉద్యోగులుగా తీసుకోవాలని నిర్ణయించడంతో భారతీయ ఐటీ నిపుణుల్లో కలవరం మొదలైంది.ఈ ఆర్ధిక సంవత్సరం మార్చి నాటికి యూఎస్‌లోని వివిధ క్యాంపస్‌లలో 1,500 మంది అమెరికన్లను నియమించుకుంటామని టీసీఎస్ తెలిపింది.

Tcs Will Hire 1500 Freshers In America This Lead To Job Cuts In India

యూఎస్‌లో స్థానికీకరణ ప్రయత్నాల్లో భాగంగానే టీసీఎస్ ఈ నిర్ణయం తీసుకుందని.తద్వారా అమెరికా ఆధారిత ప్రాజెక్టులను పొందేందుకు వీలు కలుగుతుందని కంపెనీ భావిస్తోంది.

టీసీఎస్ మానవ వనరుల విభాగం గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కాడ్ దీనిని ధృవీకరించారు.

స్థానికీకరణ, ఇతర భౌగోళిక అంశాలు, నైపుణ్యం తదితర అంశాలతో పాటు వినియోగదారులకు దగ్గరగా ఉండటం వారి అవసరాలను తీర్చే దీర్ఘకాలిక వ్యూహాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

గత త్రైమాసికంలో టీసీఎస్‌ ఆదాయంలో 50 శాతం అమెరికా నుంచే వచ్చింది.అయితే పెరుగుతున్న వీసా ఖర్చులు, వీసా అనుమతులపై అనిశ్చితి ఉన్న కారణంగా స్థానిక అమెరికన్లను, అది కూడా ఫ్రెషర్లను ఉద్యోగాల్లో నియమించుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్‌లో పనిచేస్తోన్న 4.5 లక్షల మంది ఉద్యోగుల్లో 40 వేల మంది అమెరికన్లే ఉన్నారు.వీరిలో ఎక్కువ మంది భారతదేశంలోనే విధులు నిర్వహిస్తున్నారు.అయితే ఇదే సమయంలో ఫ్రెషర్లుగా అమెరికన్లను నియమించడం వల్ల అనుభవజ్ఞులైన భారతీయులకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలున్నాయి.ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఖర్చులు తగ్గించడంలో భాగంగా టీసీఎస్ పిరమిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) వి రామకృష్ణన్ తెలిపారు.

అయితే ఏ ఉద్యోగిని అయినా రాజీనామా చేయమని లేదా వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి చేయమని ఆయన వెల్లడించారు.అయితే అదే సమయంలో పనితీరును బట్టి ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉండవచ్చిన రామకృష్ణన్ తెలిపారు.అంటే పనితీరు లేని అనుభవజ్ఞులైన ఉద్యోగులను మాత్రం తీసివేయవచ్చన్నారు.

దీనిని బట్టి భారతదేశంలోని వివిధ క్యాంపస్‌లలో పనిచేస్తున్న మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని… ఎందుకంటే కంపెనీ వారికి పనితీరు ఆధారంగా తీసివేతలను నిర్ణయిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదే సమయంలో టీసీఎస్ పెద్ద సంఖ్యలో అనుభవజ్ఞులైన ఉద్యోగులను కోల్పోయే అవకాశం ఉంది.

#TCS

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tcs Will Hire 1500 Freshers In America This Lead To Job Cuts In India Related Telugu News,Photos/Pics,Images..