అవును, మీరు విన్నది నిజమే.విదేశీ పర్యటన ప్యాకేజీలు( Tourism Packages ) అక్టోబర్ 1 నుండి మరింత తక్కువ ధరలలో మీకు అందుబాటులోకి రానున్నాయి.సాధారణంగా ఇప్పటి వరకు విదేశీయానం చేసేవారికి టూర్ ప్యాకేజీపై రూ.7 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 20 శాతం టిసిఎస్ ( టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ ) చెల్లించాల్సి వుండేది అయితే ప్రస్తుత సడలింపులతో ఇది కాస్త 5 శాతానికి దిగింది.ఈ నిబంధనను 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సి ఉంది.అయితే ప్రభుత్వం దానిని ఇంకా ఓ 3 నెలల పొడిగించింది.దానిని అక్టోబర్ 1 నుండి అమలు చేయాలని నిర్ణయించింది.

కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టూర్ ప్యాకేజీ( Tour Package )తో విదేశాలకు వెళ్లే వారికి కాస్త వూరట చేకూరనుందని విశ్లేషకులు అంటున్నారు.రూ.7 లక్షల కంటే ఎక్కువ ఖరీదు చేసే టూర్ ప్యాకేజీలపై 20 శాతం టిసిఎస్ పన్ను చెల్లించాల్సి వుండగా ఎప్పటినుండో ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై 20 శాతం టిసిఎస్‌ను రద్దు చేయాలని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తోంది.కాగా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినట్టు చెబుతున్నాయి కొన్ని టూరిజం సంస్థలు.

అయితే ఇంకా ఈ టూరిజం సడలింపులకు సంబందించిన సమాచారం అధికారికంగా ప్రకటించాల్సి వుంది.కాగా ఈ నిర్ణయంగాని నిజమైతే విదేశాల్లో అనేక మార్పులు జరగనున్నాయి.వైద్యం లేదా విద్యపై రూ.7 లక్షల కంటే ఎక్కువ అక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది.అయితే పాత పాలన మాదిరిగానే, రూ.7 లక్షల కంటే ఎక్కువ వైద్య, విద్య ఖర్చులపై 5 శాతం టిసిఎస్ విధిస్తారు.అయితే కొందరు విశ్లేషకులు మాత్రం విదేశీ టూర్ ప్యాకేజీలు, ఎల్‌ఆర్‌ఎస్ కింద విదేశాలకు పంపే డబ్బుపై టిసిఎస్ రేటును 5 శాతం నుండి 20 శాతానికి పెంచుతున్నట్లు ఊహాగానాలు చేస్తున్నారు.