భారతీయ కంపెనీపై అమెరికా కోర్టు సంచలన తీర్పు..!!!   TCS Cleared By US Court Of Favouring Indian Workers Over Americans     2018-11-30   16:31:38  IST  Surya

అమెరికాలో ఎంతో మంది భారతీయులు ఐటీ రంగ నిపుణులుగా స్థిరపడిపోయారు..అంతేకాదు కొంతమంది అమెరికాలో పెట్టుబడులు పెట్టి మరీ అక్కడ ఐటీ సంస్థలని ఏర్పాటు చేసి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలాఉంటే భారత్ లోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐటీ దిగ్గజ సంస్థలలో ఒకటైన టీసీఎస్ సైతం అమెరికాలో తన కార్య కలాపాలు నిర్వహిస్తూ ఉంది..అయితే

అమెరికాలో గతంలో టీసీఎస్ దక్షిణాసియా ఉద్యోగుల్ని జాతి వివక్షత నెపంతో తొలగించిందని మాజీ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో కంపెనీపై దావా వేశారు…అయితే అప్పటి నుంచీ పలురకాలుగా విచారణలో చేపట్టిన కోర్టు భారతీయ కంపెనీపై వచ్చిన ఆరోపణలు అసత్యాలు అంటూ తీర్పు ఇచ్చింది..అంతేకాదు

ఆ కంపెనీ ఎటువంటి జాతి వివక్ష చూపలేదని వెల్లడించింది…జ్యూరీలోని తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా టీసీఎస్‌కు మద్దతిచ్చారు…దాంతో కోర్టు టీసీఎస్‌పై ఆరోపణలను తోసిపుచ్చడం భారత ఐటీ ఔట్‌సోర్సింగ్‌ రంగ నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.