ట్రంప్ నిర్ణయం వెనుక రీజన్ ఇదీ..టీసీఎస్ సిఈవో..!!  

TCS CEO Rajesh Gopinath, Donald Trump, H1B visas, TCS CEO on Trump Decision -

రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తులు తాకట్టు పెట్టడం రాజకీయ నాయకులకి కొత్తేమి కాదు.అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఇలాంటి రాజకీయాలు మినహాయింపు కాదు.

 Tcs Ceo Trump H1b Visa Decision

ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో పెద్దన్న ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా తన సొంత ప్రజల విషయంలో, అమెరికా అభివృద్ధి విషయంలో మాత్రం తప్పటడుగులు రాజకీయం చేస్తోందని అంటున్నారు నిపుణులు.

అమెరికా అధ్యక్షుడు తాజాగా అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులపై మోపుతున్న ఉక్కు పాదం అమెరికా అభివృద్ధికి దారుణమైన ఆటంకం కలిగించడమే కాకుండా ఆర్ధికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు టీసీయస్ సీఈవో రాజేశ్ గోపీనాద్.

ట్రంప్ నిర్ణయం వెనుక రీజన్ ఇదీ..టీసీఎస్ సిఈవో..-Telugu NRI-Telugu Tollywood Photo Image

విదేశీ వర్కర్లకు అనుమతిని ఇచ్చే హెచ్1 బీ, ఎల్-1 వీసాలపై ఆక్షలు పెట్టడం మంచి పరిణామం కాదని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ క్రమంలోనే ట్రంప్ నిర్ణయాలని తప్పుబట్టారు.

భారతీయ నిపుణులు ఎన్నో ఏళ్ళుగా అలుపెరుగని సేవలను అమెరికా క్లైంట్స్ కి అందించారని అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఈ స్థాయిలో బలపడడానికి ప్రధానకారమైన భారతీయులపై ట్రంప్ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు.ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితి దిక్కు తోచని స్థితిలో ఉందని ఆయన తెలిపారు.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమేనని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదని తన అభిప్రాయాన్ని తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tcs Ceo Trump H1b Visa Decision Related Telugu News,Photos/Pics,Images..