ఫ్యాన్స్ కి సాయం చేసి గొప్ప మనసు చూపించిన పాప్ సింగర్  

Taylor Swift Surprises Fans Impacted By Corona Virus American Pop Singer - Telugu American Pop Singer, Corona Effect, Covid-19, Taylor Swift Surprises Fans Impacted By Corona Virus

నటులు, పాప్ సింగర్స్ ని చాలా మంది అభిమానిస్తూ ఉంటారు.వారికి లక్షల్లో అభిమానులు ఉంటారు.

 Taylor Swift Surprises Fans Impacted By Corona Virus American Pop Singer

అభిమానుల కోసం సెలబ్రిటీలు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకిఅ అందుబాటులో ఉంటున్నారు.

వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతున్నారు.వారితో ముచ్చట్లు షేర్ చేసుకుంటున్నారు.

ఫ్యాన్స్ కి సాయం చేసి గొప్ప మనసు చూపించిన పాప్ సింగర్-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఓ పాప్ సింగర్ మరో అడుగు ముందుకేసి కష్టం చెప్పుకున్న అభిమానికి క్షణాల్లో సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది.ప్రఖ్యాత అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ సాయం చేసింది.

కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న తరుణంలో ఆమె తన అభిమానులకు అండగా నిలబడింది.

స్విఫ్ట్ తన టంబ్లర్ ఖాతా చూస్తుండగా కరోనా సోకినా ఓ అభిమాని పెట్టిన పోస్ట్ ఆమెను చాలా బాధకు గురిచేసింది.

నా జీవితం చాలా దుర్భరంగా సాగుతోంది.ఇక్కడ జీవించలేకపోతున్నాను.న్యూయార్క్ సిటీని వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను అని అందులో రాసాడు.ఈ పోస్ట్ చూసిన టేలర్ వెంటనే 3000 డాలర్లు అంటే అక్షరాలా 2.2 లక్షలు ఆ అభిమాని ఖాతాకు పంపించింది.నాకు ఇన్నాళ్లు మీరు అండగా నిలిచారు.

ఇప్పుడు మీకు అండగా నేను ఉన్నాను.అధైర్యపడకండి.

ఈ డబ్బు మీకు కొంత ఉపయోగపడుతుందనుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది.ఊహించని విధంగా తనకు ఇంత మొత్తంలో డబ్బు చేతికందడం, అది కూడా తాను ఎంతగానో ఆరాధించే సెలబ్రిటీ నుంచి ఈ సాయం అందడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు.

స్విప్ట్ ఇలాగే మరో అభిమానికి కూడా సాయం చేసి తన ఉదారత చాటుకుంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Taylor Swift Surprises Fans Impacted By Corona Virus Related Telugu News,Photos/Pics,Images..