బాగా సన్నబడిన అనంతపురం బ్యూటీ... అవకాశాల కోసమేనా...

తెలుగులో యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “టాక్సీవాలా” చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనంతపురం బ్యూటీ “ప్రియాంక జవాల్కర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించడానికంటే ముందుగా పలు లఘు చిత్రాలు మరియు “కలవరం ఆయే” అనే చిత్రంలో కూడా నటించింది.

 Taxiwala Movie Fame Priyanka Jawalkar Weight Loss For Movie Offers, Taxiwala Mov-TeluguStop.com

కానీ ఈ అమ్మడికి గుర్తింపు వచ్చింది మాత్రం టాక్సీవాలా చిత్రంతోనే.అయితే ఈ మధ్య  ప్రియాంక జవాల్కర్ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

 దీంతో తన గ్లామర్ డోస్ ఈ విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదు.

అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేటువంటి ప్రియాంక జవాల్కర్ ఈ మధ్య తనకి సినిమాకి సంబంధించిన సమాచారాన్ని అలాగే లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.

 ఈ క్రమంలో తాజాగా తీసుకున్న తన అందమైన ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మధ్య ప్రియాంక జవాల్కర్ సినిమా అవకాశాల కోసం బాగా బరువు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ బ్యూటీ నేచురల్ గా గా బరువు తగ్గేందుకు గానూ సొంతంగా ఫిట్నెస్ ట్రైనర్ ని నియమించుకోవడంతో పాటూ, ఆహారపు డైట్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట.అయితే  ప్రియాంక జవాల్కర్ షేర్ చేసిన ఈ ఫోటోలకు కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.

 అంతేకాక ఈ అమ్మడి అందానికు ఫిదా అయిన నెటిజన్లు “రానురాను ప్రియాంక జవాల్కర్ తన అంద చందాలతో కట్టిపడేస్తుందని” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ తెలుగులో “తిమ్మరుసు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా సత్యదేవ్ నటిస్తుండగా బ్రహ్మాజీ, రవి బాబు, అజయ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.అలాగే ప్రముఖ “గమనం” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

 కాగా ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ సుజనా రావు దర్శకత్వం వహిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ లభించింది.

అయితే ఈ చిత్రాన్ని దాదాపుగా 4 భాషలలో దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube