‘ట్యాక్సీవాలా’ కలెక్షన్స్‌

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జువాల్కర్‌ జంటగా తెరకెక్కిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం విడుదలకు రెండు నెలల ముందే పైరసీ అవ్వడం తెల్సిందే.

 Taxiwala First Day Box Office Collections-TeluguStop.com

సినిమా ఎడిటెడ్‌ వర్షన్‌ లీక్‌ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు.సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాల మద్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా తప్పకుండా విజయంను సాధిస్తుందనే నమ్మకం ఏ ఒక్కరిలో లేదు.కాని అనూహ్యంగా సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ టాక్‌ను దక్కించుకుంది.

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

మొదటి రోజు హైదరాబాద్‌లోని పలు థియేటర్లు హౌస్‌ ఫుల్‌ అయ్యాయి.వీకెండ్‌ అవ్వడంతో మల్టీప్లెక్స్‌ు కిటకిటలాడాయి.దాంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ దక్కుతున్నాయి.

విజయ్‌కి ఉన్న క్రేజ్‌ మరియు మంచి టాక్‌ కారణంగా మొదటి రెండు రోజుల్లోనే సినిమా మొత్తం రికవరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలోని కామెడీ సీన్స్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఒక మంచి కాన్సెప్ట్‌తో సినిమా రావడంతో ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.

ట్యాక్సీవాలా చిత్రం మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల షేర్‌ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మరో సాలిడ్‌ సక్సెస్‌ దక్కినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube