నా ఫేవరేట్ హీరో అతడేనంటున్న టాక్సీవాలా బ్యూటీ...

తెలుగులో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించిన “టాక్సీవాలా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన అనంతపూర్ బ్యూటీ “ప్రియాంక జవాల్కర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

 Taxiwala Fame Priyanka Jaywalker About Her Favorite Hero In Telugu Film Industry-TeluguStop.com

కానీ కరోనా వైరస్ కారణంగా ఈ అమ్మడి సినిమా షూటింగులు కొంతమేర ఆలస్యం అవుతున్నాయి.అయితే తాజాగా ప్రియాంక జవాల్కర్ గతంలో తనతో కలిసి పని చేసిన ఓ స్నేహితురాలితో కలిసి ఇంస్టాగ్రామ్ ఖాతాలో లైవ్ కార్యక్రమం నిర్వహించింది.

ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చింది.

ఇందులో భాగంగా ఓ నెటిజన్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మీ ఫేవరెట్ హీరో ఎవరని.? ప్రశ్నించాడు.దీంతో ప్రియాంక జవాల్కర్ ఏ మాత్రం ఆలోచించకుండా ఠక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని తెలిపింది.

అలాగే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని చూశానని తనకు చాలా బాగా నచ్చిందని కూడా చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుత సినిమా ప్రాజెక్టుల గురించి స్పందిస్తూ తాను “తిమ్మరసు” చిత్రంలో నటిస్తున్నానని అయితే ఈ చిత్ర షూటింగ్ సెట్లో మాత్రం హీరో సత్యదేవ్ మరియు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ లు చాలా సరదాగా ఉంటారని అంతేకాకుండా తనని ఎప్పుడు ఆటపట్టిస్తూ ఉంటారని కూడా చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక జవాల్కర్ పలు లఘు చిత్రాలలో కూడా నటించింది.అంతేగాక అందంగా కనిపించడం కోసం పలు సర్జరీలను కూడా చేయించుకుంది.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు దాదాపుగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో గమనం, తిమ్మరుసు, తదితర చిత్రాలు ఉన్నాయి.

కాగా ఇటీవలే తమిళ భాషకు చెందిన మరో చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube