దేవరకొండ కుమ్మేశాడు.. ట్యాక్సీవాలా లెక్కలు చెప్తే అవాక్కవాల్సిందే

విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపితం అయ్యింది.యూత్‌ లో విజయ్‌ దేవరకొండ శిఖరాగ్రాన ఉన్నట్లుగా తాజాగా ట్యాక్సీవాలా ఫలితం చెప్పకనే చెబుతోంది.

 Taxi Wala Movie Unbelievable Collections-TeluguStop.com

రెండు నెలల క్రితమే పైరసీ అయ్యింది, ఏమాత్రం అంచనాలు లేని ట్యాక్సీవాలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నేరుగా శాటిలైట్‌ రైట్స్‌ అమ్మాలని, తాను మరో సినిమా చేస్తాను అంటూ విజయ్‌ దేవరకొండ నిర్మాతలను కోరాడు.

కాని నిర్మాతలు మాత్రం సినిమాను విడుదల చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్‌దేవరకొండ ఆ సినిమాకు ప్రమోషన్స్‌ చేయాల్సి వచ్చింది.అనూహ్యంగా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో మొదటి రోజే 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చాయి.అయిదు కోట్ల రూపాయల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే 5 కోట్ల షేర్‌ను దక్కించుకోవడంతో బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకుంది.

అద్బుతమైన ఈ రికార్డు ఈమద్య కాలంలో ఏ సినిమాకు దక్కలేదు.విడుదలైన మొదటి రోజే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచిందని చెప్పుకోవాలి.

అర్జున్‌ రెడ్డి తర్వాత రూపొందిన ట్యాక్సీవాలా చిత్రంను ప్రమోషన్స్‌ కలిపి 5 కోట్లలో పూర్తి చేశారు.రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యి, నిర్మాతకు కాసుల వర్షం కురిపించబోతుంది.మొదటి రోజే 5 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం లాంగ్‌ రన్‌ లో 20 కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.ఇక శాటిలైట్‌ రైట్స్‌ ఇతర రైట్స్‌ ద్వారా నిర్మాతకు మొత్తంగా 25 కోట్ల వరకు ఖాతాలో పడే అవకాశం ఉందంటున్నారు.5 కోట్ల సినిమాకు 25 కోట్ల లాభాలు అంటే మామూలు విషయం కాదు.ఇదంతా కేవలం విజయ్‌ దేవరకొండ మహిమ అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube