ట్యాక్స్ పేయర్లా.. పన్ను మినహాయింపు పొందడానికి ఈ 3 మార్గాలు ఎంచుకోండి..!

సంపాదించిన డబ్బులో చాలావరకు పన్నులకే కట్టాల్సి వస్తుందని చాలామంది కాస్త నిరాశ పడుతుంటారు.బాధ్యత గల ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాల్సిందే.

 Tax Payers Follow These Three Ways To Get Tax Exception Details, Tax Payers, Ta-TeluguStop.com

కానీ చెల్లించాల్సిన పన్నులో కొంతమేర మినహాయింపు పొందడానికి కూడా గవర్నమెంట్ అనుమతిస్తుంది.ఇలా చట్టబద్ధంగా మీరు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

ముఖ్యంగా మూడు మార్గాల ద్వారా ఇది సాధ్యం అవుతుంది.ఆ మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1.ELSS ఫండ్

ELSS ఫండ్ లేదా ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

దీని ద్వారా పన్ను ఆదా చేసుకోవడం మాత్రమే కాదు మీ ఇన్వెస్ట్మెంట్ పై అధిక రాబడిని కూడా పొందొచ్చు.ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.46,800 వరకు పన్ను రూపంలో సేవ్ చేసుకోవచ్చు.వీటి వడ్డీపై పాక్షిక పన్ను చెల్లిస్తే సరిపోతుంది.

2.ఫిక్స్‌‌డ్ డిపాజిట్

ఫిక్స్‌‌డ్ డిపాజిట్స్‌లో మీ నగదును పెట్టుబడి పెట్టి ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు.సెక్షన్ 80సీ ప్రకారం ఫిక్స్‌‌డ్ డిపాజిట్స్‌లోని రూ.1.5 లక్షల వరకు నగదు పై పన్ను మినహాయింపు లభిస్తుంది.అయితే ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీకి మాత్రం పన్ను వర్తిస్తుంది.

3.పీపీఎఫ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో నగదు జమ చేసి వాటిపై మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు.ఈ పథకంలో మీరు రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.మీ ఇన్వెస్ట్మెంట్ పై వచ్చే వడ్డీ పైన కూడా ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఇంకా చెప్పాలంటే, చాలా పొదుపు పథకాల ద్వారా మీరు పన్ను మినహాయింపులు పొందడం సాధ్యమవుతుంది.

ఆదాయపు పన్ను శాఖ తీసుకొచ్చిన సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్పీఎస్ పెన్షన్ స్కీం, యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్స్… ఇలా వివిధ రకాల పథకాల ద్వారా మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Income Tax Saving Tips Tax Deduction Tips Tax Saving Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube