బాబు..జనం కన్నా...విమానాలే ఎక్కువా!!!

అస్సెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఒక పక్క పాలక పక్షం, మరో పక్క ప్రతి పక్షం ఒకరిపై మరొకరు రాజధాని బిల్లుపై రచ్చ చేసుకుంటున్న సంధర్భంలో మెల్లగా ఒక బిల్లును సీమంధ్ర సర్కార్ పాస్ చెయ్యడం, పైగా, శాసనసభ సైతం దానిని ఆమోదించడం జరిగిపోయింది.

 Tax Bill Passed In Assembly-TeluguStop.com

ఇంతకీ ఆ బిల్లు ఏమిటనేగా మీ అనుమానం అదీ విమానాల ఇందనాలపై పన్ను తగ్గింపు సవరణ బిల్లు.విమానాల ఇందనాలపై ప్రస్తుతం 16శాతం పన్ను ఉండగా, దానిని అమాంతంగా 1% నికి తగ్గించేశారు.

మరి డీజిల్, పెట్రోల్ పై ఏటా పన్నులు పెంచుతూ సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న ప్రభుత్వానికి విమానాలపై అంత మోజు ఎందుకో అర్ధం కావడంలేదు.ఇక ఈ బిల్లు విషయంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన సమాధానం చూస్తే ప్రభుత్వానికి ప్రజలంటే ఎంత ప్రేమో అర్ధం అవుతుంది.

దీనిపై వివరణ ఇచ్చే క్రమంలో యనమల మాట్లాడుతూ విమానాల పన్ను తగ్గించడం వల్ల రాకపోకలు పెరుగుతాయి అని, సామాన్యుడు సైతం విమానాల్లో తిరుగుతారు అని, రాష్ట్రంలో విమానయ రంగానికి ఊపు వస్తుంది అని సమర్ధించుకున్నారు.

మరి సాధారణ ప్రజలపై లేని ప్రేమ విమానాలపై ఎందుకే “పాలించే” వాడికే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube