టాటూల పిచ్చి అతనిని ఎక్కడకు తీసుకువెళ్లిందంటే..

Tattoos Made On Every Part Of The Body Body Turned, Tattoos, Body , Body Turned, Piercing , Remy, Social Media ,

యూత్‌లో టాటూ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.అయితే టాటూల పిచ్చితో కొందరు చేసే పనులు చూస్తే తెగ ఆశ్చర్యం కలుగుతుంది.

 Tattoos Made On Every Part Of The Body Body Turned, Tattoos, Body , Body Turned-TeluguStop.com

కెనడా చెందిన ఒక వ్యక్తి టాటూల వ్యవహారం ఆసక్తికంగా మారింది.రెమి అనే చెఫ్ అనే వ్యక్తి తన శరీరమంతా టాటూలు వేయించుకున్నాడు.

ఫలితంగా అతని శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది.చెఫ్ రెమీ శరీరాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వ్యక్తి శరీరంలో పచ్చబొట్టు వేయించుకోని భాగమంటూ ఏదీ లేదు.అతను టాటూల మోజులో పడి ఎంతగానో మారిపోయాడని అతని స్నేహితులు చెబుతారు.

అతను నాలుగేళ్లుగా తన శరీరంపై సూదులు పొడిపించుకుంటూ శరీరం మొత్తాన్ని నీలం రంగులోకి మార్చుకున్నాడు.

టాటూలు వేయించుకోవడంపై ఆయనకున్న ప్రేమ ఇప్పటికీ తగ్గడం లేదు.

అతను తన ప్రవర్తనపై చాలా సంతోషంగా ఉన్నాడు.అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చెఫ్ రెమీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అత్యధికం.

ఇన్‌స్టాగ్రామ్‌లో 186,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.దాదాపు 4 సంవత్సరాలుగా తాను చేస్తున్న ఈ పని గురించి రెమీ మీడియాతో పంచుకున్నాడు.

తుంటిపై టాటూలు వేయించుకోవడం చాలా బాధాకరమని తెలిపాడు.టాటూలతో పాటు రెమీకి పియర్సింగ్ అంటే కూడా చాలా ఇష్టం.

దీని కోసం ఎంత బాధనైనా ఓర్చుకుంటాడు.ఒకసారి అతను శరీరంలోని అంతర్గత భాగాలపై కుట్లు వేయించుకున్నాడు.

అప్పుడు ఎంతో నొప్పి కలిగినా భరించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube