కరోనా మృతుల కుటుంబాలకు అండగా టాటా స్టీల్..!

కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు టాటా స్టీల్ అండగా ఉంటుంది.తమ కంపెనీలో పనిచేస్తూ కరోనా వల్ల మృతి చెందితే ఆ కుటుంబానికి సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వరకు నెల జీతాన్ని ఇస్తారని ప్రకటించారు.

 Tata Steel Announced Social Security Scheme For Employee Families, Announced , C-TeluguStop.com

ఆ ఉద్యోగి లాస్ట్ మంత్ పే ఎంత ఉంటుందో అంత మొత్తాన్ని వారి కుటుంబానికి అతని రిటైర్మెంట్ వరకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారట.అంతేకాదు కంపెనీలో పనిచేస్తూ మరణించిన ఫ్రంట్ లైన్ వర్కర్ల పిల్లలకు గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు కంపెనీ మొత్తం ఖర్చు పెట్టుకుంటుందని చెబుతున్నారు.

నెల శాలరీ ఇవ్వడంతో పాటుగా ఫ్రంట్ లైన్ వర్కర్ల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.టాటా స్టీల్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటాపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్లు.టాటా కంపెనీలో లానే మిగతా కంపెనీలు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రకటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.

జంషెడ్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయానికి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సంతృప్తిగా ఉన్నారు. కరోనా టైం లో టాటా గ్రూప్ తీసుకున్న ఈ సోషల్ సెక్యురిటీ స్కీం పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube