మిస్త్రీ నియామకాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టాటా సన్స్

టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ ని పునర్ నియమిస్తూ ఇటీవల ఎన్ సీఎల్ ఏటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆయన పునర్ నియామకాన్ని సవాల్ చేస్తూ టాటా సన్స్ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

 Tata Sons Moves Supreme Court Over Cyrus Mistrys Reappointment As Company Chair-TeluguStop.com

ఈ నెల 9 వ తేదీన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డు భేటీ జరగనున్న నేపథ్యంలో టాటా సన్స్ ఈ సమయంలో సుప్రీం ను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.మిస్త్రీ నియామకం చెల్లదంటూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం తో ఇప్పుడు ఈ అంశం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

టాటా గ్రూప్ సీఈవో గా భాద్యతలు నిర్వహిస్తున్న మిస్త్రీ ని అనూహ్య కారణాల రీత్యా 2016 లో ఆయనను బోర్డు నుంచి తొలగించిన విషయం తెలిసిందే.దీంతో ఆయ‌న న్యాయ‌పోరాటం చేశారు.

అయితే డిసెంబ‌ర్ 18వ తేదీన సైర‌స్ మిస్త్రీకి అనుకూలంగా అపిల్లేట్ ట్రిబ్యున‌ల్ తీర్పునిచ్చింది.కంపెనీ లా ట్రిబ్యున‌ల్ ఇచ్చిన ఆదేశాల‌పై స్టే విధించాల‌ని టాటా స‌న్స్ త‌న పిటిష‌న్‌లో సుప్రీంను కోరింది.

టాటా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌ను నియ‌మించ‌డాన్ని ఇటీవ‌ల కంపెనీ లా ట్రిబ్యున‌ల్ త‌న తీర్పులో త‌ప్పుపడుతూ ఆయన నియామ‌కం అక్ర‌మ‌మైంద‌ని ట్రిబ్యున‌ల్ పేర్కొన్న‌ది.దీంతో మిస్త్రీనే మ‌ళ్లీ టాటా సంస్థ‌ల‌కు సీఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఏర్ప‌డ్డాయి.

గతేడాది డిసెంబర్ లో మిస్త్రీని పున‌ర్ నియ‌మించాల‌ని ట్రిబ్యున‌ల్ స్ప‌ష్టం చేయడం తో తిరిగి మిస్త్రీ ని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించారు.దీనితో టాటా సన్స్ దీనిని సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube