పేరు మారనున్న టాటా స్కై ...!?

భారతదేశం లోనే అతిపెద్ద డీటీహెచ్ (డైరెక్ట్-టూ-హోమ్) ఆపరేటర్‌ టాటా స్కై.దాని పేరును మార్చుకుంది.అంతే కాక.సర్వీసుల్లోనూ భారీ మార్పులు తీసుకొచ్చింది.ఇప్పటివరకూ యూజర్లను ఆకట్టుకున్న టాటా స్కై.ఇకపై.టాటా ప్లేగా డీటీహెచ్ మార్కెట్‌లో అడుగుపెట్టనుంది.మొత్తం.

 Tata Sky To Be Renamed Tata Sky, Latest News, Name Change, Latest, 13 Ott, Streaming, Tata Paly, Net Flix-TeluguStop.com

టాటా స్కై ఇంటర్‌ఫేస్‌ అంతా ఇక నుంచి టాటా ప్లేగా కనిపించనుంది.మొత్తం టాటా  స్కై ఇంటర్ పేస్ లో ఈ మార్పులు కనిపించనున్నాయి.

అయితే, టాటా ప్లే.టీవీ చానెల్స్‌తో పాటు ఓటీటీ సర్వీసులను కూడా అందజేయనుంది.

 Tata Sky To Be Renamed Tata Sky, Latest News, Name Change, Latest, 13 Ott, Streaming, Tata Paly, Net Flix-పేరు మారనున్న టాటా స్కై #8230;-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకోసం.ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫామ్.

నెట్ ఫ్లిక్స్‌తో జతకట్టింది.

ఒకవేళ మనం టాటా ప్లే రీఛార్జ్ చేయకపోయినా.

కొన్ని రోజుల పాటు వాడకపోయినా మళ్లీ రీచార్జ్ చేసుకొని టాటా ప్లే సర్వీసులను వాడుకోవచ్చు.ఓటీటీ కాంబో ప్యాక్‌లను తీసుకుంటే.

యూజర్లు, టాటా ప్లే సర్వీసుల్లో భాగంగా టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు.టాటా ప్లే మొత్తంగా 13 ప్రధాన ఓటీటీ యాప్స్‌కు సపోర్టు చేస్తుంది.

అలాగే.సర్వీస్ విజిట్ ఛార్జీలను కూడా ఎత్తేసినట్లు టాటా ప్లే ఎండీ అండ్ సీఈవో హరిత్ నాగ్‌పాల్ తెలిపారు.

డీటీహెచ్ ఆపరేటర్లలో టాటా ప్లే మార్కెట్ లీడర్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు.

టాటా బ్రాండ్‌కు తగ్గట్లుగానే క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కస్టమర్లను ఆకట్టుకొంటోంది.కాగా, ఓటీటీతో పాటు కలిపి వచ్చే ఛానళ్ల ప్యాక్‌లను టాటా ప్లే త్వరలో ప్రకటించనుంది.ప్రస్తుతం.

టాటా ప్లేకి 2 కోట్లకు పైగా కనెక్షన్లు ఉన్నాయి.మన దేశ వ్యాప్తంగా.దాదాపు 4 లక్షల పట్టణాల్లో కోటీ 90 లక్షల యాక్టివ్ సబ్‌స్క్రైబర్లున్నారు.14 భాషల్లో.24 గంటల పాటు కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube