పది రూపాయలు చూపిస్తే కోటి రూపాయలు ఇస్తారు… ఎక్కడంటే?  

కేవలం పది రూపాయల చూపిస్తే చాలు మీరు కోటీశ్వరులు కావచ్చు! మీరు విన్నది నిజమే కేవలం 10 రూపాయల నోటు చూపిస్తే కోటీశ్వరులు ఎలా కావచ్చని ఆశ్చర్యానికి గురవుతున్నారా… ప్రస్తుతం ఎన్నో అక్రమాలు చాపకింద నీరులా పాకి పోతున్నాయి.ఇలాంటి అక్రమాలలో భాగంగానే పది రూపాయల నోటు కీలక పాత్ర పోషిస్తుంది.

TeluguStop.com - Taskforce Raids And Seized Rs 1 Crore Money At Gunthakal

ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టి కోట్ల రూపాయలను బెజవాడ నుంచి దేశంలో పలు ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లను చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ముఠా గ్యాంగ్ కోటి రూపాయలను గుంతకల్ పంపించే మార్గంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడి చేసి వీరిని సరైన ఆధారాలతో అరెస్టు చేశారు.

ఈ ముఠా గ్యాంగ్ వాట్సప్ ద్వారా ఇలాంటి అక్రమాలకు తెర లేపారు.ఇలాంటి ముఠా గ్యాంగ్ అంతా కలిసి వాట్సప్ గ్రూపుగా ఏర్పడి డబ్బులు ఎవరికీ? ఎక్కడ ?ఏ సమయానికి పంపించాలో అనే విషయాలను ఈ గ్రూపు ద్వారా చర్చించుకుని అక్కడికి పంపిస్తుంటారు.

TeluguStop.com - పది రూపాయలు చూపిస్తే కోటి రూపాయలు ఇస్తారు… ఎక్కడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ముఠా నిర్వహిస్తున్న లావాదేవీలను పోలీసులు ఛేదించారు.ఈ ముఠాలో భాగంగా పది రూపాయల నోటు ఇస్తారు.

అయితే ఈ నోటును ముందుగా ఫోటో తీసుకొని వాట్సాప్ గ్రూపుకు పంపిస్తారు. ఈ10 రూపాయల నోటు తీసుకున్న వ్యక్తి తనకు కావలసిన చోటికి వెళ్లి ఆ నోట్ ను ఇస్తాడు.

అయితే ఆ పది రూపాయల నోటు పై ఉన్న సీరియల్ నెంబరే కోడ్ గా పరిగణిస్తారు.ఈ కోడ్ సరిపోతే ఆ పది రూపాయల నోటు తెచ్చిన వ్యక్తికి ఆ హావాల సొమ్ము మొత్తం చేరుతుంది.

ఈ విధంగా ఈ పది రూపాయల నోటు తో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు.
ఇందులో భాగంగానే బెజవాడ నుంచి గుంతకల్ కు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కోటి రూపాయల నగదును టాస్క్ఫోర్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విజయవాడకు చెందిన ఇంద్ర సింగ్, గుంతకల్ కు చెందిన ఉదయ్ కుమారులను టాస్క్ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు.

అయితే ఇంత పెద్ద ముఠాకు కీలకపాత్ర దారుడు ఎవరు అన్న విషయాలను గురించి పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు.అయితే వీరి దగ్గర నుంచి దొరికిన సొమ్ము సంపాదించినదా? లేక నల్లధన మా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

#TaskforceRaids #Gunthakal #Vijayawada #10rs Note

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Taskforce Raids And Seized Rs 1 Crore Money At Gunthakal Related Telugu News,Photos/Pics,Images..