బిగ్‌బాస్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో

టాలీవుడ్‌లో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు.ఈ షోకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ కావడంతో బుల్లితెరపై ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

 Tarun Refuses Of Joining Bigg Boss, Bigg Boss, Tarun, Tollywood News, Bigg Boss-TeluguStop.com

బిగ్‌బాస్ సీజన్ 1ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో బుల్లితెరపై సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది బిగ్‌బాస్.ఇక ఈ షో ఇప్పటికే మూడు సీజన్‌లు పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ సీజన్‌కు రెడీ అయ్యింది.

బిగ్‌బాస్ 3వ సీజన్‌ను హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున, ఇప్పుడు 4వ సీజన్‌ను కూడా హోస్ట్ చేయనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు.

కాగా ఈ రియాలిటీ షోను అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలపడంతో, ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ రియాలిటీ షోలో ఈసారి ఓ హీరో పక్కాగా ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.గతంలో టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్‌కు కేరాఫ్‌గా నిలిచిన హీరో తరుణ్, బిగ్‌బాస్ 4లో ఉంటాడని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై తరుణ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

తాను బిగ్‌బాస్ 4వ సీజన్‌లో ఉంటున్నట్లు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని ఆయన తేల్చేశాడు.

ఈ రియాలిటీ షోలో తాను పాల్గొనడం లేదని, తనకు బిగ్‌బాస్‌లో ఉండాలనే ఆశ కూడా లేదని తేల్చి చెప్పాడు.దీంతో బిగ్‌బాస్‌లో తరుణ్ పాల్గొనడంపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.

ఇక బిగ్‌బాస్ 4వ సీజన్‌లో ఈసారి ఎవరెవరు పాల్గొంటారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube