పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణ్... అన్ని సెట్ అయితే ఈ ఏడాదిలోనే

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు తరుణ్.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి యూత్ కి భాగా కనెక్ట్ అవ్వడంతో లవ్ బాయ్ ఇమేజ్ తో వరుసగా హిట్స్ సొంతం చేసుకున్నాడు.

 Tarun Marriage With One Of His Close Relatives-TeluguStop.com

ఒకానొక దశలో క్రేజీ హీరోగా తరుణ్ దూసుకుపోయాడు.ఆ తరువాత సినిమాల సెలక్షన్ లో గాడి తప్పడంతో పాటు మాస్ హీరోగా ఎలివేట్ అవ్వడం కోసం లవర్ బాయ్ ఇమేజ్ నుంచి దూరంగా వచ్చి సినిమాలు చేయడంతో తరుణ్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది.

అలాగే రెగ్యులర్ గా సినిమాలు చేయడం మానేసి వేరే బిజినెస్ లపై తరుణ్ దృష్టి పెట్టడంతో హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయాడు.ఈ జెనరేషన్ కి తరుణ్ పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాడు.

 Tarun Marriage With One Of His Close Relatives-పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణ్… అన్ని సెట్ అయితే ఈ ఏడాదిలోనే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడప్పుడు అతని సినిమాలు వస్తున్న కనీసం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.అయితే టైం చూసుకొని మళ్ళీ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని ఈ మధ్య తరుణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అలాగే హీరోగానే చేయాలని రూల్స్ పెట్టుకోకుండా మంచి కథలు వస్తే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.అలాగే నిర్మాతగా మారి తన ఫ్రెండ్ ని దర్శకుడుగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే చాలా కాలంగా తరుణ్ పెళ్లి గురించి టాలీవుడ్ లో వినిపిస్తుంది.ప్రస్తుతం వయస్సు రీత్యా అతను 40+ దాటిపోయాడు.

దీంతో తరుణ్ తల్లి రోజారమణి కూడా తమ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారిలో ఒక మంచి అమ్మాయిని చూసినట్లు తెలుస్తుంది.తరుణ్ కి కూడా నచ్చడంతో ఈ ఏడాదిలోనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.

అయితే ఉన్నపళంగా కరోనా రావడంతో పెళ్లిని కొద్దిరోజులు హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది.పరిస్థితి అనుకూలిస్తే ఈ ఏడాదిలోనే తరుణ్ పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

#Relatives #Roja Ramani #Lover Boy #Tarun Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు