మరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కధ కు ఒకే చెప్పిన వెంకీ,డైరెక్టర్ ఎవరంటే!  

Sports Back Drop For Venkatesh Next Movie-hero Venkatesh,sports Back Drop Telugu Movie,tarun Bhasker,venkatesh Next Movie

‘F2’ విజయం అందుకున్న తరువాత విక్టరీ వెంకటేష్,నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కధ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.

Sports Back Drop For Venkatesh Next Movie-Hero Sports Telugu Movie Tarun Bhasker

గతంలో ‘గురు’ చిత్రంలో బాక్సింగ్ గురువు గా నటించి మెప్పించిన వెంకీ ఇప్పుడు మరోసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కధ తో ముందుకు రానున్నారు.ఈ చిత్రానికి పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.

పెళ్లి చూపులు చిత్రం ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే.ఈ చిత్రం అటు హీరో గా విజయ్ దేవర కొండకు మంచి పేరు తేగా,అలానే డైరక్టర్ తరుణ్ భాస్కర్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

Sports Back Drop For Venkatesh Next Movie-Hero Sports Telugu Movie Tarun Bhasker

అయితే ఆ ఒక్క చిత్రం తోనే తరుణ్ విజయాన్ని అందుకున్నారు.ఆ తరువాత ఆయన దర్శకత్వం వహించిన ‘ ఈ నగరానికి ఏమైందో అనే చిత్రం మాత్రం ఆయనకు సరైన పేరును తీసుకురాలేకపోయింది.

ఈ క్రమంలో ఇప్పుడు విక్టరీ తో కలిసి ఈ చిత్రం చేయనున్నట్లు సమాచారం.ఆయన వెంకటేష్ కి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కధ చెప్పాడట.

ఆ కధ వెంకటేష్ కి బాగా నచ్చిందని వెంటనే ఒకే చేసేశాడని అంటున్నారు.ఈ సినిమాలో సింహ భాగం షూటింగ్ హైదరబాద్ మలక్ పేటలో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ లో ఉండనుందని అంటున్నారు.

  గత కొంతకాలంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకటేష్ హీరోగా తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి.కానీ దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ లో బిజీ గా ఉండడం తో ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు