నారప్ప కోసం కథ సిద్ధం చేసిన తరుణ్ భాస్కర్.. త్వరలో సెట్స్ పైకి  

Tarun Bhaskar Script Ready For Venkatesh - Telugu Suresh Productions, Tarun Bhaskar, Telugu Cinema, Tollywood, Venkatesh

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడుగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తరుణ్ భాస్కర్.విజయ్ దేవరకొండ కెరియర్ లో హీరోగా వచ్చిన మొదటి సినిమా అదే.

 Tarun Bhaskar Script Ready For Venkatesh

ఈ సినిమా తర్వాత ఈ కుర్ర దర్శకుడు దశ తిరిగిందని, అవకాశాలు పుష్కలంగా వస్తాయని భావించారు.అయితే తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని ఈ నగరానికి ఏమైంది అంటూ ఓ చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.మల్టీ షేడ్స్ చూపించే ఈ దర్శకుడు తర్వాత నటుడు అవతారం ఎత్తాడు.మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో హీరోగా మారిపోయాడు.ఇప్పుడు నీకు మాత్రమే చెప్తా అనే టాక్ షో తో ప్రేక్షకుల ముందుకి యాంకర్ గా వచ్చాడు.

నారప్ప కోసం కథ సిద్ధం చేసిన తరుణ్ భాస్కర్.. త్వరలో సెట్స్ పైకి-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే దర్శకుడుగా తన మూడో సినిమాని కూడా ఈ కుర్ర దర్శకుడు సురేష్ ప్రొడక్షన్ లోనే చేస్తున్నాడు.అయితే ఈ సారి విక్టరీ వెంకటేష్ తో చేస్తూ ఉండటం విశేషం.

దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి బౌండ్ స్క్రిప్ట్ తో ఉన్నట్లు తాజాగా తరుణ్ భాస్కర్ చెప్పాడు.ప్రస్తుతం నారప్ప సినిమా షూటింగ్ లో వెంకటేష్ ఉన్నాడు.

ఈ సినిమా ఎలాంటి గ్యాప్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది.త్వరలో టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తరుణ్ మూవీ ఓపెనింగ్ జరుపనున్నట్లు తెలుస్తుంది.ఈ లోపు తరుణ్ భాస్కర్ మంచు లక్ష్మి లీడ్ రోల్ లో నెట్‌ఫ్లిక్స్‌ కోసం లస్ట్‌ స్టోరీస్‌ ఆంథాలజీలో వెబ్ సిరీస్ డైరెక్ట్‌ చేశారు.

త్వరలో ఇది కూడా ప్రసారం కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు