షాకింగ్ : వాళ్లు కూడా విడాకులు తీసుకున్నారు?

ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు విడాకుల ఫీవర్ పట్టుకుందా అంటే పరిస్థితులు చూస్తే మాత్రం నిజమే అనిపిస్తుంది.ఇటీవలికాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ దాంపత్య బంధానికి విడాకులతో స్వస్తి పలుకుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 Tarun Bhaskar Divorce , Tarun Bhakser , Tollywood , Director, Actor, Dhanush , Iswarya-TeluguStop.com

అయితే ఇలా విడిపోతున్న వారిలో ప్రేమ వివాహం చేసుకున్న వారు ఎక్కువగా ఉండటం గమనార్హం.ఒకప్పుడు ప్రేమ వివాహం చేసుకుని సినీ పెద్దల ఆశీర్వాదాలు ప్రేక్షకుల అభిమానాన్ని కూడగట్టుకున్న ఎన్నో జంటలు ఇటీవలి కాలంలో మాత్రం విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇస్తున్నారు.

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కొనసాగుతున్న నాగచైతన్య సమంత ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఒకరి పట్ల ఒకరు ఎంతో అమితమైన ప్రేమను చూపించే వారు.

 Tarun Bhaskar Divorce , Tarun Bhakser , Tollywood , Director, Actor, Dhanush , Iswarya-షాకింగ్ : వాళ్లు కూడా విడాకులు తీసుకున్నారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ సడన్గా విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చారు.ఇక మొన్నటికి మొన్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఏరికోరి చేసుకున్న కిరణ్ రావు విడాకులు ఇస్తున్నట్లు చెప్పి అభిమానులందరికీ షాకిచ్చాడు.

ఇక ఇటీవల హీరో ధనుష్ ఏకంగా ప్రేమ పెళ్లి చేసుకుని 18 సంవత్సరాలుగా అన్యోన్యంగా ఉంటూ ఇటీవలే పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు.ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో సింపుల్గా విడిపోతున్నారు.

ఇప్పుడు ఈ జాబితాలోకి మరో టాలీవుడ్ జంట వచ్చి చేరినట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తో సంచలన విజయాన్ని అందుకొని ఒక్కసారిగా దర్శకుడిగా గుర్తింపు సంపాదించాడు తరుణ్ భాస్కర్.ఆ తర్వాత పలు సినిమాల్లో దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా కూడా ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్.తన భార్య లత నుంచి విడిపోతున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది.అయితే వీరిద్దరిదీ ప్రేమ వివాహం కావడం గమనార్హం.

అయితే మా మధ్య ఎంతో మంచి అండర్స్టాండింగ్ ఉందని ఒకరంటే ఒకరికి ప్రాణం అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్.ఇలాంటి జంట ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube