మెనోపాజ్‌ సమస్యలకు చెక్ పెట్టే చామదుంప‌..ఎలా తీసుకోవాలంటే?

మెనోపాజ్‌ ప్ర‌తి మ‌హిళ ఖ‌చ్చితంగా ఎదుర్కోవాల్సిన స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.రజస్వల అయినప్పటి నుంచి ప్ర‌తి నెలా ప‌ల‌క‌రించే రుతుక్రమం ఆగిపోవ‌డాన్ని మెనోపాజ్ అంటారు.

 Taro Root Helps To Control Menopause Problems-TeluguStop.com

సాధార‌ణంగా 45 ఏళ్లు దాటిన మ‌హిళ‌ల్లో మెనోపాజ్ ఏర్ప‌డుతుంది.ఈ మెనోపాజ్ ద‌శ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అల‌స‌ట‌, ఓంట్లో నుంచి వేడి ఆవిర్లు, మూడ్ తరుచు మారిపోవడం, రాత్రి పూట వీపరీతమైన చెమటలు, నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం, జుట్టు రాలిపోవ‌డం, తలతిరగడం, బ‌రువు పెర‌గ‌డం, ఏకాగ్రత స‌న్న‌గిల్ల‌డం, ఏదో తెలియ‌న ఆందోళ‌న, గుండెదడ, చర్మం పొడి బారిపోవటం, కండరాల నొప్పులు ఇలా చాలా స‌మ‌స్య‌లు తీవ్రంగా వేధిస్తుంటాయి.

 Taro Root Helps To Control Menopause Problems-మెనోపాజ్‌ సమస్యలకు చెక్ పెట్టే చామదుంప‌..ఎలా తీసుకోవాలంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను సహజ మార్గాల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు.

ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే మెనోపాజ్ ద‌శ‌లో ఏర్ప‌డే స‌మ‌స్య‌ల‌కు దూరం ఉండొచ్చు.అలాంటి ఆహారాలు చామ ‌దుంప ఒక‌టి.న్యూట్రీషియన్స్ పుష్క‌లంగా ఉండే చామ ‌దుంప‌ల‌ను ఉడికించి తీసుకోవ‌డం, కూర రూపంలో తీసుకోవ‌డం చేయాలి.

మెనోపాజ్ ద‌శ‌లో ఏర్ప‌డే వేడి ఆవిర్లు, అధిక చెమ‌ట‌లు, గుండె ద‌డ‌, నిద్ర ‌లేమి స‌మ‌స్య‌ల‌కు చామ దుంప చెక్ పెడుతుంది.అలాగే మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా ప‌ని చేసేందుకు చామ దుంప స‌హాయ‌ప‌డుతుంది.యాంటీ- ఇన్‌ప్లమేటరీ, యాంటీ- స్పాజ్మాడిక్‌, యాంటీ- ఆక్సిడెంట్‌ గుణాలు చామ ‌దుంపులో ఉంటాయి.

అందువ‌ల్ల‌, చామ దుంపల‌ను డైట్‌లో చేర్చుకుంటే పీరియ‌డ్ క్రాంప్స్‌, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల నొప్పులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.ఇక చామ దుంప‌తో పాటు విటమిన్లు, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సమృద్ధిగా అందేలా చూసుకోవాలి.

టీ, కాఫీల‌కు దూరంగా ఉండాలి.సిగరెట్, మద్యం అలవాట్ల‌ను మానుకోవాలి.

అలాగే ప్ర‌తి రోజు వ్యాయామం చేయాలి.దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే అదుపులో ఉంచుకోవాలి.

#Tips #Taro Root #Taro Root #Menopause

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు