మరొక వారం జక్కన్నకు ఓకే చెప్పిన తారక్!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Tarak Says Ok To Jakkanna For Another Week, Ntr, Ram Charan, Rajamouli, Rrr Movi-TeluguStop.com

ఈ సినిమాలో టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.

Telugu Evarumeelo, Rajamouli, Ram Charan, Reshoot, Rrr, Tarak Jakkanna-Movie

ఈ సినిమా ఈ మధ్యనే షూట్ పూర్తి చేసుకుందని వార్తలు అయితే వచ్చాయి కానీ అధికారికంగా మాత్రం ప్రకటన అయితే చెయ్యలేదు.కానీ చరణ్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయారంటూ టాక్ అయితే వచ్చింది.కానీ ఈ షూట్ ఇంకా పూర్తి అవ్వలేదట.ప్రెసెంట్ ప్యాచ్ వర్క్ జరుగుతుంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సన్నివేశాలు రాజమౌళికి సంతృప్తి ఇవ్వలేదని అందుకే మళ్ళీ ఈ షాట్స్ ను మళ్ళీ రీషూట్ చేయబోతున్నాడని టాక్.

అయితే ఇందుకోసం ఎన్టీఆర్ ఒక వారం రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట.ఈ వారం రోజుల పాటు ఎన్టీఆర్ మళ్ళీ భీం గెటప్ వేస్తాడని తెలుస్తుంది.అయితే ప్రెసెంట్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Evarumeelo, Rajamouli, Ram Charan, Reshoot, Rrr, Tarak Jakkanna-Movie

ఇప్పటికే ఎన్టీఆర్ ఈ షో కోసం షూటింగ్ లో పాల్గొని కొన్ని ఎపిసోడ్స్ షూట్ పూర్తి చేసాడట.ఇక ఇప్పుడు రెండవసారి మళ్ళీ షో కోసం షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ షూట్ ఒక పది రోజుల్లో ముగుస్తుంది.

ఇది అవ్వగానే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నాడట.అయితే ఎన్టీఆర్ ఒక్కరేనా లేదంటే రామ్ చరణ్ కూడా ఇందులో పాల్గొంటున్నాడా అనేది ఇంకా బయటకు రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube