బాబాయ్, అబ్బాయిపై తారకరత్న సంచలన వ్యాఖ్యలు.. వారితో పోల్చుకోను అంటూ..

నందమూరి తారక రత్న గురించి అందరికి తెలుసు.ఈయన చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా నందమూరి హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

 Tarak Ratna Equation With Nandamuri Heroes, Tarak Ratna, Ntr, Balakrishna, Nandamuri Heroes,nandi Award For Amravati,trivikram, Web Series 9 Hours,mahesh Babu-TeluguStop.com

ఈయన హీరోగా పరిచయం అయినా తర్వాత కొన్ని సినిమాలలో నటించిన మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు.దీంతో ఈయన ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

విలన్ గా కూడా ఎన్ని సినిమాలు చేసిన ఈయనకు మంచి గుర్తింపు అయితే రాలేదు.కానీ తారక రత్న చేసిన అమరావతి సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు.

 Tarak Ratna Equation With Nandamuri Heroes, Tarak Ratna, NTR, Balakrishna, Nandamuri Heroes,Nandi Award For Amravati,Trivikram, Web Series 9 Hours,Mahesh Babu-బాబాయ్, అబ్బాయిపై తారకరత్న సంచలన వ్యాఖ్యలు.. వారితో పోల్చుకోను అంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈయనకు గుర్తింపు రాకపోవడంతో సైలెంట్ అయ్యాడు.అయితే ఇటీవలే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో తారకరత్న కూడా నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ తారక రత్న ను మళ్ళీ తెరపై గ్రాండ్ గా పరిచయం చేయాలనీ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఇక ఈయన ప్రెసెంట్ 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా ప్రొమోషన్స్ లో పాల్గొన్నాడు.ఈ ప్రొమోషన్స్ లో తన బాబాయ్ బాలకృష్ణ గురించి, తమ్ముడు ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాడు.

ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాబాయ్ బాలయ్య లాగా, తమ్ముడు ఎన్టీఆర్ లాగా నేను ఎప్పుడు నటించాలని అనుకోను.వారిలా చేయాలనీ కూడా అనుకోలేదు.నా డైరెక్టర్ నా నుండి ఎంత వరకు కోరుకుంటున్నారో అంత ఇస్తా.

నా స్టైల్ లో మాత్రమే నేను నటిస్తా.ఏ క్యారెక్టర్ అయినా నటించడానికి నేను సిద్ధంగా ఉన్న్నాను.

సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా విజయం సాధించాలంటే మంచి స్క్రిప్ట్ కావాలి.అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube