పుట్టిన రోజు విషెస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన తారక్

టాలీవుడ్ లో అగ్ర హీరోల అభిమానుల మధ్య సినిమా రిలీజ్ సందర్భంగా ఒకప్పుడు విపరీతమైన పోటీ ఉండేది.మొదటి రోజు కటౌట్ విషయంలో అభిమానులు ఎవరికి వారు పోటీ పడేవాడు.

 Tarak Got 7 Million Wishes Tweets, Tollywood, Rrr Movie, Social Media, Jr Ntr, S-TeluguStop.com

అలాగే ఆడియో రిలీజ్ సందర్భంగా కూడా విపరీతమైన హైప్ క్రియేట్ చేసేవారు.సినిమా రిలీజ్ సమయంలో టికెట్ కొనుగోలులో కూడా భారీ ధరకి టికెట్ కొని రికార్డులు సృష్టించేవారు.

ఇప్పుడు ఈ రికార్డుల పోటీ సోషల్ మీడియాలోకి వచ్చేసింది.తమ అభిమాన హీరోలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి పోటీ పడుతున్నారు.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అతన బర్త్ డే హాష్ ట్యాగ్ ని వైరల్ చేసి ఏకంగా కోటి మంది విషెస్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేశారు.

ఇక తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ అభిమానులు కూడా ఈ విషయంలో ట్విట్టర్ లో గట్టిగానే బర్త్ డే విషెస్ చెప్పి రికార్డులు క్రియేట్ అయ్యేలా చేశారు.

కేవలం 4 గంటల 15 నిమిషాలలో అభిమానుల నుంచి దాదాపుగా ఏడు మిలియన్ ట్వీట్స్ ద్వారా ఎన్టీఆర్ కి విషెస్ తెలియజేశారు.ట్విట్టర్ మానేజ్మెంట్ ఇలా జరగడం ప్రప్రధమం అని తెలియజేశారు.

గతం లో ఏ సినీస్టార్ కి బర్త్ డే శుభాకాంక్షలు ఈ రేంజ్ లో చెప్పలేదని తెలిపారు.ప్రస్తుతం అతి తక్కువ సమయంలో ఏడు మిలియన్ ట్వీట్స్ పొందటం రికార్డుగా చెబుతున్నారు.

మొత్తానికి పుట్టిన రోజు సందర్భంగా మొన్న పవన్ కళ్యాణ్ ట్రెండ్ అయితే నిన్న తారక్ కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యాడు అంటే అభిమానుల సందడి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube