ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ కావడం గమనార్హం.
ఈ సాంగ్ మరో నాలుగు ఒరిజినల్ సాంగ్స్ తో పోటీ పడుతుండగా ఆర్ఆర్ఆర్ కే అవార్డ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.ఉత్తమ నటుడు కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తాడని అందరూ భావించినా అందుకు భిన్నంగా జరిగింది.
అయితే ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కాకపోయినా ఆస్కార్ రాకపోయినా తారక్ గొప్పోడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.తారక్ గొప్ప నటుడని కళ్లతోనే ఎలాంటి హావభావాలనైనా అద్భుతంగా పలికించగల ప్రతిభ తారక్ సొంతమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అవార్డులు వచ్చినా రాకపోయినా తారక్ ప్రతిభను ప్రపంచం గుర్తించిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీస్తూనే ఉంటాడని అవార్డుల కోసం ట్రై చేస్తూనే ఉంటామని ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి తారక్ కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఊహకు అందని స్థాయిలో చరణ్, తారక్ లకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కావడంతో సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.జక్కన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా ఆస్కార్ తో పాటు మరికొన్ని అవార్డులు ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
