గ్రహాంతర వాసిగా తాప్సీ... త్వరలోనే ప్రకటన?

టాలీవుడ్ సినీనటి సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.అంతే కాకుండా తమిళంలో కూడా నటించింది ఈ బ్యూటీ.

 Tapsi Soon Announced As An Alien-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

 Tapsi Soon Announced As An Alien-గ్రహాంతర వాసిగా తాప్సీ… త్వరలోనే ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక బాలీవుడ్ లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై దృష్టి పెట్టింది.ఇక ప్రస్తుతం ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో కీలక పాత్రలో నటిస్తోంది.

అంతేకాకుండా శభాష్ మిథు అనే సినిమాలో కూడా బిజీగా ఉంది.ఇక హసీన్ దిల్ రూబా సినిమాలో నటించగా త్వరలోనే విడుదల కానుంది.ఇక ఇవే కాకుండా రష్మీ రాకెట్, లూప్ ల పేటా సినిమాలలో కూడా నటిస్తుంది.ఇక మరో సినిమాలో నటించనుండగా అందులో గ్రహాంతరవాసిగా కనిపించనుందట.

భరత్ నీలకంఠన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు తెలిసింది.ఇక ఆ సినిమా గ్రహాంతర వాసులు నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ కథలో తెరకెక్కనుందట.ఇక ఈ సినిమాకు ఏలియన్అనే పేరును కూడా అనుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాను హాలీవుడ్ ఏలియన్స్ పరంగా కాకుండా కాస్త కొత్తగా కనిపించనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఎలియన్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆ కథ విధంగా తెరకెక్కనుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట.అంతే కాకుండా ఎక్కువ భాషల్లో కూడా ఈ సినిమాను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

మొత్తానికి ఈ సినిమాను డైరెక్టర్ భరత్ నీలకంఠన్ కాస్త కొత్తదనాన్ని జోడించి రూపొందించనున్నట్లు తెలియగా ఈ సినిమాలో తాప్సీ ఎలా కనిపించిందో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

#BharathNila #Alien #Taapsee Pannu #Pan India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు