తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన, నటిస్తున్న తాప్సి త్వరలో సినిమాలకు గుడ్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.తెలుగులో పలు సినిమాల్లో నటించినా కూడా ఈమెకు రావాల్సిన గుర్తింపు రాలేదు.
తాప్సి తెలుగులో చివరిగా ‘సాహసం’ సినిమాలో నటించింది.ఆ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా కూడా తాప్సికి ఆ తర్వాత ఆఫర్లు రాలేదు.
దాంతో తమిళం వైపుకు వెళ్లింది.తమిళంలో కూడా ఈమెకు అంతంత మాత్రంగానే ఆఫర్లు వచ్చాయి.
అక్కడి నుండి ఈమె బాలీవుడ్లో అవకాశం దక్కించుకుంది.
బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన తాప్సి త్వరలో ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా తర్వాత ఈమెకు పెద్దగా ఆఫర్లు వచ్చేలా లేవు.అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పే విషయం గురించి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్లో ‘బేబీ’ తర్వాత ఆఫర్లు రాని పక్షంలో మరో సినిమా కోసం ప్రయత్నించకుండా ఇక ఫిల్మ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఆమె సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందుతోంది.సొట్టబుగ్గల చిన్నది సినిమాలకు గుడ్‌బై చెప్పి, ఏం చేస్తుందో చూడాలి.
అందరి హీరోయిన్లలాగా పెళ్లి చేసుకుని గృహిణిగా సెటిల్ అవుతుందేమో అని కొందరు అంటున్నారు.