నందమూరి బాలకృష్ణతో జోడికట్టబోతున్న తాప్సి … ఓ తెలుగు ఛానెల్ కథనం.బాలకృష్ణ వందొవ చిత్రంలో తాప్సి … ఒక తెలుగు వెబ్ సైట్ ఆర్టికల్.
విషయం తాప్సి దాకా వెళ్ళింది.ఇంకేముంది సదరు వెబ్ సైట్ కి ట్విట్టర్లోనే బదులిచ్చింది తాప్సి.
ఈ గాలివార్తలు ఆపెయ్యండి ప్లీజ్ అని.
బాలకృష్ణ – సింగీతం శ్రీనివాస్ కాంబినేషన్లో ఆదిత్య 369 కి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే.ఇది బాలకృష్ణకి వందొవ చిత్రం అన్న సంగతి విదితమే.ఇంకా నిర్మాత, హీరోయిన్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి తాప్సిని అంటించాయి కొన్ని ఛానెళ్లు, వెబ్ సైట్లు.
దాంతో తాప్సి ఇలా వేడుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం తాప్సి రానాతో ఘజి, అమితాబ్ బచ్చన్ – సుజీత్ సర్కార్ కాంబినేషన్లో ఓ చిత్రం, అక్షయ్ కుమార్ సరసన కత్తి రీమేక్ లో నటిస్తోంది.
.