ప్రముఖ దర్శక ధీరుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాలో మంచు మనోజ్ సరసన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి తాప్సీ.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే తాప్సీ అందం గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
అందం అంటే బట్టలలో మాత్రమే కాదనీ, ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అందంగా కనిపించాలంటే స్కిన్ షో చేయడం కాదని ఓ సందర్భంలో తాప్సీ తెలియజేశారు.
మొదట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని పాత్రల్లో నటించడానికి బికినీ ధరించాల్సివచ్చినప్పుడు నో అని చెప్పలేదు.కానీ తనకు బికినీలు ధరించడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదని, ఫ్యాన్స్ కూడా తనను అలా చూడటానికి ఇష్టపడరని ఆమె పేర్కొన్నారు.
కోలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ కరోనా కారణం వల్ల షూటింగ్ ఆగిపోయింది.అయితే లాక్ డౌన్ కారణంగా కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీ లాక్ డౌన్ తర్వాత తను నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని,హాలిడే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి ఎంతో ఎంజాయ్ చేశారు.తాప్సీ మాల్దీవులకు వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.అప్పుడు మాల్దీవులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టాయి.అయితే ప్రస్తుతం మాల్దీవుల నుంచి వచ్చిన తాప్సీ బాలీవుడ్ సినిమాల షూటింగ్ లలో పాల్గొన్నారు.ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే తాప్సీ, తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు.
వేరొకరి గురించి పెద్దగా పట్టించుకోని తాప్సీ తన విషయంలో ఎవరైనా తప్పుగా ట్రోల్ చేస్తే మాత్రం వారికి సరైన పద్ధతిలో తాప్సీ సమాధానం చెబుతారు.