ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా?

దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అయిన ఈ సొట్ట బుగ్గల బ్యూటీ తాప్సీ పను.తను ఫ్యాషన్ రంగంలో మోడలింగ్ చేసింది.

 Tapsee Pannu, Bollywood Heroine, Viral Photo, Puzzle Photo, Vacation Photo, Thap-TeluguStop.com

మొదటగా 2010 ఝుమ్మంది నాదం చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.తెలుగులో దాదాపు 12 పైగా సినిమాలను చేయగా తమిళ భాషల్లో కూడా నటించింది ఈ ముద్దు గుమ్మ.

బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది తాప్సీ.అంతేకాకుండా అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన థప్పడ్ చిత్రంలో నటించగా… ఈ చిత్రంతో మంచి నటిగా ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకుంది.

అంతేకాకుండా తను రిలేషన్ లో ఉన్నదని….తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతను ఎవరో కాదు ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.

అంతేకాకుండా వారి ప్రేమ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసని కొన్ని  ఇంటర్వ్యు లో  నిజాలు బయటపెట్టింది.

ఇదిలా ఉండగా తను సోషల్ మీడియాలో ఒక ఫోటోను  షేర్ చేసి ” మన చుట్టూ ఉన్న ప్రకృతి మనల్ని అందంగా చూపించడమే కాకుండా… అందాన్ని పెంచుతుంది.

అందమైన ప్రకృతి, వెలుగునిచ్చే కాంతి మొత్తం ఇలాగే ఉంచాలని ఎప్పటికీ  వాటిని చెడగొట్టదని” తెలిపింది.నిజంగానే తను దిగిన ఫోటోలో ప్రశాంతమైన గాలితో, నీలి రంగుతో కూడిన ఆకాశం, సముద్రం అక్కడక్కడ మేఘాలతో కలిసినట్టుగా అంతే కాకుండా సముద్రపు ఒడ్డుకి తీరాన తెల్లని ఇసుక కలయపోయినట్లు గా తాప్సీ తెల్లని గౌన్ తో,తలపై టోపీ పెట్టుకొని దీనంగా నిలుచొని ఎండిపోయిన చెట్టు మొదలులో ఆనుకొని నేల వైపు చూపులతో అందంగా ఆకట్టుకుంది.

ఇక ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే 5 లక్షల పైగా లైకులు వచ్చాయి.అంతే కాకుండా ప్రకృతికి తగ్గట్లుగా కామెంట్లు కూడా అలాగే ఇచ్చారు నెటిజన్లు.

ఇక తాప్సీ తెలుగులో,బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటిస్తుండగా అవి 2021లో విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube