తాప్సి అందాల విందు

రింగు జుట్టు సుందరి తాప్సి ఈమధ్య తెలుగులో కనిపించడమే మానేసింది.మొదటి అవకాశమే రాఘవేంద్రరావు లాంటి దర్శకుడితో రావడంతో తాప్సి అందాలు సినిజనాల్ని తెగ ఆకర్షించాయి.

 Tapsee Heats Up Maxim-TeluguStop.com

దాంతో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అమ్మడుకి అన్ని పెద్ద అవకాశాలే వచ్చాయి.కాని నటిగా నిరూపించుకుంటేనే కదా, ఎక్కువ కాలం కొనసాగేది.

అలా ఎంత స్పీడ్ గా దూసుకొచ్చిందో అంతే తొందరగా మాయమైపోయింది తాప్సి.

అటు బాలివుడ్ సినిమాలు చేసినా, అవకాశాలు అక్కడా అంతంతమాత్రమే.

గత ఏడాది వచ్చిన బేబి సినిమాతో మళ్ళి జనాల దృష్టిలో పడింది తాప్సి.ఆ సినిమా హిట్ అవడంతో, అమితాబ్ బచ్చన్ – సుజీత్ సర్కార్ కాంబినేషన్లో రాబోతున్న సరికొత్త చిత్రంలో తాప్సిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోతున్న కత్తి హింది రిమేక్ లో కూడా తాప్సినే హీరోయిన్ అంటున్నారు.ఇక రాణా దగ్గుబాటి హింది – తెలుగు భాషల్లో తీస్తున్న ఘజి చిత్రంలో తాప్సి ఎలాగూ ఉంది.

ఇన్ని అవకాశాలు ఒక్కసారిగా రావడానికి బేబి చిత్రమే కారణం.

ఇలా తన పేరు వార్తల్లో ఉండగానే, వాతవరణాన్ని ఇంకా వేడెక్కించేద్దాం అనుకుందో ఏమో తాప్సి.

మాక్జిమ్ మ్యాగజీన్ కి హాట్ హాట్ గా ఫోటోషూట్ చేసి పెట్టింది.ఈ కొత్త ఫోటోషూట్ తాప్సి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంది అనే దానికి ఈ ఫోటో చిన్న ఉదాహరణ మాత్రమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube