రాఘవేంద్ర రావు నడుము చూపించే విధానంపై హీరోయిన్ విమర్శలు

తెలుగు సినిమాకి గ్లామర్ ని పరిచయం చేసిన దర్శకుడు కే.రాఘవేంద్రరావు.

 Tapsee Makes Fun Of Raghavendra Rao’s Midriff Obsession-TeluguStop.com

హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడం అప్పటికే బాలివుడ్ లో మొదలైంది కాని, తెలుగులో అలాంటి పంథా లేదు.అప్పుడొచ్చిన రాఘవేంద్ర రావు, సినిమాల్లో గ్లామరస్ పాటలు కూడా ఓ భాగామయ్యేలా చేసారు.

శ్రీదేవి, జయప్రద, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, టబు ఇలాంటివారెందరో రాఘవేంద్రరావు సినిమాల్లో కనిపించి, పాటల్లో అందాలు ఆరబోసి పెద్ద నటీమణులు అయినవారే.రాఘవేంద్రరావు పాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు.

హీరోయిన్ నడుమందాలు ఆరబోస్తోంటే, పళ్ళు, పూలు వచ్చి హీరోయిన్ నడుముపై పడటం అనేది రాఘవేంద్ర రావు ట్రేడ్ మార్కు షాట్.ఈ ట్రేడ్ మార్క్ షాట్ లో ఈతరం వారు చాలా తక్కువ మంది కనిపించారు.

ఆ అతితక్కువ మంది హీరోయిన్లలో తాప్సి కూడా ఉంది.

ఇప్పుడిప్పుడే బాలివుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదుగుతున్న తాప్సి తన కెరీర్ లో తెలుగు సినిమాలతోనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

అందులోనూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ఉత్తరాది భామ.ఆనాడు రాఘవేంద్రరావు సినిమాలో హుషారుగా కనిపించిన తాప్సి, ఇప్పుడు మాత్రం ఆయనపై జోకులు వేస్తోంది.ఇటివలే ఓ కామెడి షోలో రాఘవేంద్రరావు శైలిపై విమర్శలు చేసింది తాప్సి.

“నన్ను పరిచయం చేసిన దర్శకుడుకి హీరోయిన్లని శృంగారభరితంగా చూపిస్తాడనే పేరుంది.శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లు ఆయన క్యాంప్ నుంచి వచ్చే పెద్ద హీరోయిన్లు అయ్యారు.నేను ఆయన తీసిన 105వ సినిమాలో నటించాను.ఆయన హీరోయిన్ల నడుముపై పళ్ళు, పూలు కొడుతుంటాడు.కాని నేను దానికి సిద్ధంగా లేను ఆ సమయంలో.

ఈ డైరెక్టర్ తీసిన శ్రీదేవి, జయప్రద పాటలు కొన్ని చూసాను.వారి నడుము మీద పళ్ళు, పూలు పడుతున్నాయి.

కాని నా నడుము మీద కొబ్బరికాయ కొట్టేసాడు (గట్టిగా నవ్వుతూ).కొబ్బరికాయతో హీరోయిన్ నడుముని కొడితే అందులో శృంగారం ఏముందో నాకైతే ఆర్థం కాదు (ఇంకా నవ్వుతూ).

నన్ను ఆ పాటల్లో చూసి తప్పుగా అనుకోకండి” అంటూ కామెంట్ చేసింది తాప్సి.

అయితే ఇదే తాప్సి, ఝుమ్మంది నాదం సినిమా విడుదలకి ముందు నా మీద పూలు పళ్ళు బాగా వేసారని, ఎన్ని వేసారు, ఎక్కడ వేసారో సినిమాలో చూడండి, ఈ టీంతో పనిచేయడం మంచి అనుభవం, మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ మాట్లాడింది.

దీంతో తాప్సిపై మండిపడుతున్నారు తెలుగు సినీ ప్రేమికులు.ఇష్టం లేకపోతే అప్పుడు చేయాల్సింది కాదు, అప్పుడు అవకాశం కోసం చేసి, ఇప్పుడు సెటిల్ అయ్యాకా ఇలా కామెడి చేయడం ఏమి బాగాలేదని తాప్సిని తప్పుపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube