సమంత ప్లేస్ లో తాప్సి

ఢిల్లి భామ తాప్సి తెలుగులో దాదాపు గా డజను సినిమాలు చేసింది.అందులో అన్ని క్రేజి ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

 Tapsee In Kaththi Remake-TeluguStop.com

అదృష్టం అంటే తాప్సిదే అనుకున్నారంతా, ఎందుకంటే హిట్స్ పెద్దగా లేకపోయినా అవకాశాలు తగ్గలేదు ఈ ముద్దుగుమ్మకి.కాని ఎన్నోరోజులు తాప్సి అదృష్టం నిలువలేదు.

ఇప్పుడు తెలుగులోంచి దాదాపు కనుమరుగైపోయింది ఈ భామ.

అడపదడపా బాలివుడ్ సినిమాలు చేసినప్పటికి అక్కడ కూడా సరైన బ్రేక్ రాలేదు తాప్సికి.అయితే ఇదే ఎడాది మొదట్లో వచ్చిన అక్షయ్ కుమార్ బేబి మంచి హిట్ గా నిలిచింది.సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా, తాప్సి మంచి పర్ఫార్మెన్స్ తో మార్కులు కొట్టేసింది.

ఆ సినిమాలో ఆకట్టుకోవడంతో ఇప్పుడు మరో అవకాశం ఇస్తున్నాడు అక్షయ్ కుమార్.

తమిళ “కత్తి” ని హిందీలో రిమేక్ చేయనున్నారు.మురగదాస్ నిర్మాణంలో తరకెక్కనున్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన కథానాయికగా తాప్సిని ఎంపిక చేసినట్లు సమాచారం.తమిళంలో ఈ పాత్రను సమంత చేసిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube