ప్రేమలో ఉన్న అయిన పెళ్లి తర్వాతే అన్ని అంటున్న తాప్సి

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న పంజాబీ ముద్దుగుమ్మ తాప్సి.ఈ భామకి తెలుగులో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ తన మనసుకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తుంది.

 Tapsee Gives Celerity On Her Boy Friend-TeluguStop.com

ఇప్పుడు బాలీవుడ్ లో కంటెంట్ బేస్ కథలు అంటే వెంటనే తాప్సి పేరు వినిపిస్తుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత అందరి భామల తరహాలోనే తాప్సి కూడా ప్రేమలో పండింది.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.అలాగే ప్రస్తుతం డేటింగ్, పెళ్ళికి ముందు పిల్లల్ని కనడంపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

పెళ్ళికి ముందు డేటింగ్ అంటూ తిరగడం, అలాగే పెళ్లి కాకుండానే తల్లి కావడం లాంటి కల్చర్ తనకి అస్సలు నచ్చదని, అలాంటి వాటికి తాను చాలా దూరంగా ఉంటానని తాప్సి చెప్పింది.తన జీవితంలో తల్లి కావడం అనేది పెళ్లి తర్వాతే జరుగుతుందని స్పష్టం చేసింది.

నేను ప్రేమలో ఉన్నట్లు ఇది వరకే చెప్పాను.అయితే తను మాత్రం కచ్చితంగా సెలబ్రిటీ కాదు.

సెలబ్రిటీ లైఫ్‌కు చాలా దూరంగా కామన్‌ లైఫ్‌ లో ఉన్న వ్యక్తి.ఇక తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, పిల్లలను ఎప్పుడు కనాలనేది మాత్రం తన వ్యక్తిగత విషయం అని చెప్పింది.

మొత్తానికి తెలుగు హీరోయిన్స్ తరహాలో ఈ భామ కూడా ఈ ఫారిన్ కుర్రాడితో ప్రేమలో పడిందో తెలుసుకోవాలని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube