సోనూ సూద్ బాటలో తాప్సీ.. ఏం చేసిందంటే?  

Tapsee Gifts Iphone To A Student, Tapsee, Iphone, Sonu Sood, Student, Bollywood News - Telugu Bollywood News, Iphone, Sonu Sood, Student, Tapsee

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు వినిపిస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఎలాంటి సహాయానికైనా తాను రెడీ అంటూ ముందుకు వస్తున్న ఈ నటుడు, తన సొంత ఖర్చులతో వారికి సహాయం చేస్తున్నాడు.

 Tapsee Gifts Iphone To A Student

లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను తమ సొంతూళ్లకు పంపేందుకు సోనూ సూద్ చేసిన సహాయం గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఆ తరువాత ఏదో ఓ రకంగా ప్రజలకు సాయం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న సోనూ సూద్, ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ రైతుకు ట్రాక్టర్‌ను అందించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు.

సోనూ సూద్ బాటలో తాప్సీ.. ఏం చేసిందంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు పలువురు సెలబ్రిటీలు సోనూ సూద్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను కూడా తనవంతు సాయంగా ఓ విద్యార్ధి చదువు కోసం ఐఫోన్‌ను కొని పెట్టింది.

పీయూసీ పరీక్షల్లో 94 శాతం మార్కులు తెచ్చుకున్న కర్ణాటకు చెందిన ఓ విద్యార్ధినికి లాక్‌డౌన్ కారణంగా చదువుకోవడానికి సెల్‌ఫోన్ అవసరం అయ్యింది.

ఈ విషయాన్ని ఆమె తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, తాప్సీ ఈ పోస్ట్‌ను చూసి సదరు విద్యార్ధినికి ఐఫోన్‌ను అందించింది.

తాప్సీ చేసిన సాయం తనకు చాలా ఉపయోగపడుతుందని, ఆమె సాయం ఎప్పటికీ మరిచిపోలేనని ఆ విద్యార్ధిని సంతోషం వ్యక్తం చేస్తోంది.మొత్తానికి సోనూ సూద్ బాటలో మరికొందరు సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఇలాంటి మంచి పనులు చేయాలని అభిమానులు కోరుతున్నారు.

#Sonu Sood #Tapsee #Student #Iphone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tapsee Gifts Iphone To A Student Related Telugu News,Photos/Pics,Images..